ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Friendship Day Telugu Wishes, Greetings, Quotes, Status – Top 50 – ఫ్రెండ్షిప్ డే
మరిచే స్నేహం చేయకు
స్నేహం చేసి మరువకు
మోసం చేసి స్నేహం చేస్తే తప్పు లేదు కానీ
మోసం చేయడానికే స్నేహం చేయకు
మన ఆట పాటల్లోనే కాదు,
మన జీవితంలోని ఆటు పోట్లలో
తోడుండే వారే నిజమైన స్నేహితులు.
ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
తిరిగి ఏకమై పయనాన్ని
సాగించే బంధమే స్నేహ బంధం.
స్నేహమంటే మన భుజంపై
చెయ్యేసి మాట్లాడటం కాదు,
మన కష్ట సమయాలలో భుజం
తట్టి నేనున్నాని చెప్పటం.
కులమత బేధం చూడనిది,
పేద, ధనిక బేధం లేనిది,
బంధుత్వం కన్నా
గొప్పది స్నేహం ఒక్కటే
నీగురించి అన్నీ తెలిసిన
వ్యక్తి, కలవలేక పోయినా
నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే
Friendship Day Telugu Greetings
కనులు నీవి, కన్నీరు నాది.
హృదయం నీది, సవ్వడి నాది.
ఈ స్నేహబంధం మా ఇద్దరిది
మీరు గాయపడితే సానుభూతి తెలిపే వారు చాలామంది ఉంటారు,
కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రమే ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు
సృష్టిలో అతి మధురమైనది,
జీవితంలో మనిషి మరువలేనిది
స్నేహం ఒక్కటే
గాయపడిన హృదయానికి స్నేహమే మూలిక
నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా..
నీ కన్నీళ్లు మాత్రమే తెలిసిన మిత్రుడు మిన్న
Friendship Day Telugu Wishes
స్నేహం అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం..
వాడుకోవడం కాదు వదులుకోకపోవడం
నిజాయితీ, నమ్మకం లేని స్నేహం
ఎక్కువ కాలం నిలబడదు
మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళాలి..
మిత్రుడు కష్టాల్లో ఉన్నపుడు పిలవకున్నా వెళ్లాలి.
నిజమైన స్నేహితుడిని మోసం చేయకు..
చేసినా వాడు ఒకరోజు నిన్ను క్షమిస్తాడు.
స్నేహం ఒక దారం లాంటిది,
తెగితే అతకటానికి ముడి వేసే మరో స్నేహితుడు కావాలి.
స్నేహం అనేది కేవలం ఒక ఇష్టమైన బాధ్యత,
ఇక్కడ అవకాశం తీసుకోవడం మంచిది కాదు.
బాధపడుతున్న స్నేహితుడి పక్కన
నిశ్శబ్దంగా కూర్చోవడమే
మనం ఇవ్వగల ఉత్తమ బహుమతి.
స్నేహితుల రోజు శుభాకాంక్షలు
ప్రపంచం నిన్ను గుర్తించనప్పుడు
ఒక నిజమైన స్నేహితుడు మాత్రమే నిన్ను గుర్తిస్తాడు.
ప్రేమ గల హృదయం అందమైనది..
స్నేహితులు కలిగిన జీవితం అద్భుతమైనది
స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు..
అంతటి త్యాగం చేసే స్నేహితుడ్ని పొందటమే కష్టం
కన్నీరు తుడిచేవాడు.. స్నేహితుడు
కన్నీరు తెప్పించేవాడు కాదు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
అసలైన స్నేహితులు తమ ప్రేమను
కష్ట సమయాల్లో చూపిస్తారు,
ఆనందంలో కాదు.
నిజమైన స్నేహితుడు అంటే,
అతను అక్కడ లేనప్పుడు,
మీ బాగు కోసం తక్షణం అక్కడికి చేరుకునే వ్యక్తి.
జీవితంలో ఎక్కువ సమయం నీతో వున్నవాడు నీ స్నేహితుడు అయిపోడు..
తక్కువ సమయమే వున్నా నిన్ను అర్ధం చేసుకున్న వాడే నిజమైన స్నేహితుడు..
మంచి స్నేహం వల్ల
జీవితంలో చెడును జయించడం భలే తేలిక..
నిజమైన స్నేహితులు మీ సమస్యలను అదృశ్యం చేసేవారు మాత్రమే కాదు,
మీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మీతో నిలిచేవారు కూడా.. ”
జీవితంలోని ప్రతి దశలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక స్నేహితుడు ఉంటాడు.
కానీ అదృష్టవంతులకు మాత్రమే జీవితంలోని అన్ని దశలలో ఒకే స్నేహితుడు ఉంటాడు. ”
ఈ భూమిపై నిజమైన స్నేహం కంటే
ఎక్కువ విలువైనది ఏదీ లేదు.
Telugu Quotes on Friendship
స్నేహం అనేది రెండు శరీరాలలో వుండే ఒక మనస్సు.
మంచి స్నేహితుడు భాధలలో కూడా మిమ్మల్ని నవ్వించే వ్యక్తి.
స్నేహం ఆనందాన్ని మెరుగుపరుస్తుంది మరియు కష్టాలను తగ్గిస్తుంది.
నిజమైన స్నేహితుడు నిన్ను తిడతాడు, కొడతాడు, గేలిచేస్తాడు,
చివరికి అందనంత ఆకాశానికి ఎత్తుతాడు.
స్నేహితులు అనేవారు దేవుడు మనకు పరోక్షంగా ఇచ్ఛే తోబుట్టువులు.
నిజమైన స్నేహితుడు
మీలోని లోపాలను మీకు చూపిస్తాడు,
మీకు ధైర్యాన్ని నింపుతాడు.
కొన్నిసార్లు మీ స్నేహితుడితో కలిసి ఉండటం
మీకు అవసరమైన చికిత్స.
నిజమైన స్నేహం యొక్క అర్థం,
ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు అర్థం చేసుకోబడటం.
నా స్నేహితుడి కోసం నేను చేయగలిగినది
జీవితాంతం అతనికి స్నేహితుడిగా ఉండటమే.
Emotional Telugu Quotes on Friends
నిజమైన స్నేహితుడు మీ కళ్ళలోని భాదని చూసేవాడు,
మిగతా అందరూ మీ ముఖంలోని చిరునవ్వు వెతుకుతారు.
స్నేహం అనేది మీకు ఎక్కువ కాలం తెలిసినవారి గురించి కాదు.
మీ జీవితంతో పాటు ఎక్కువగా ఎవరు నడిచారు అనేదాని గురించి.
నిజమైన స్నేహితులు మిమ్మల్ని చీకటిలోనించి తిరిగి వెలుగులోకి నడిపించే అరుదైన వ్యక్తులు.
ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న నిశ్శబ్దం నిజమైన స్నేహనికి దారితీస్తుంది.
నాలోని ఉత్తమమైన లక్షణాలను గుర్తించేవాడే నా బెస్ట్ ఫ్రెండ్.
ఇచ్చింది మరచిపోవడం..
పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహం
నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు..
కాని స్నేహం అనే పదం చాలా గొప్పది”
Friendship – Telugu Kavithalu, Telugu Poetry, Telugu Quotes, Telugu Stories
స్నేహానికి కులం లేదు..
స్నేహానికి మతం లేదు..
స్నేహానికి హోదా లేదు…
బంధుత్వం కంటే గొప్పది,
వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!
స్నేహితుల రోజు శుభాకాంక్షలు
గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలి అని నేనెన్నడూ కోరుకోను
నాకు చేదోడు వాదోడు గా ఉన్న నా మిత్రులే గొప్పవాళ్ళు కావాలని నేను కోరుకొంటాను
అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలు చాలు
భార్యాభర్తలు విడిపోవాలంటే విడాకులు చాలు
నిజమైన స్నేహితులు విడిపోవాలంటే చచ్చి పోవాలి అంతే .
మీ శత్రువుకు మీ మిత్రుడిగా మారడానికి
వెయ్యి అవకాశాలు ఇవ్వండి !
కానీ మీ మిత్రుడిని మీకు శత్రువుగా అవ్వడానికి మాత్రంఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వొద్దు
అంతరాత్మ మనకు మంచి స్నేహితుడు కనుక
ఎప్పుడూ తన మాట వినవలసిందే ! “
పెద్దగా కొట్లాట.. కానీ ఓ చిన్న సారీ (sorry )
చిలిపిగా ఓ కోపం.. కానీ ముద్దుగా ఓ నవ్వు..
బాధగా విడిపోవడం.. కానీ తియ్యగా మళ్ళీ కలయిక..
ఇదేనండీ మన ఫ్రెండ్షిప్
Friendship Day Telugu Wishes, Greetings, Quotes, Status – Top 50 – ఫ్రెండ్షిప్ డే