ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హాలి హాలి హాలీ… హాలి హాలి హాలీ
హాలి హాలి హాలీ
నన్ను కితకితలే పెడుతోంది గాలి
హాలి హాలి హాలీ
పూల పరిమళమై రేగింది ధూళి
తొలితొలిగా నా రెండు కన్నుల్లో
తడితడిగా తేనెల వానలే
తలమునకై ఆ తేనె వాగుల్లో
బతుకంతా తీపెక్కిపోయెనే
తెల్ల తెల్లటి హృదయమే
సిగ్గుతో ఎర్రగా మారెనే
నల్లా నల్లటి చీకటే
నవ్వులతో వెలిగింది నీ వల్లనే
హో, హాలి హాలి హాలీ
నన్ను కితకితలే పెడుతోంది గాలి
హాలి హాలి హాలీ
పూల పరిమళమై రేగింది ధూళి
నా కలలే ఊగెనులే నీ ఊహల్లో ఓ ఓ
నా అడుగే సాగెనులే నీ దారుల్లో ఓ ఓ
దేవుణ్ణి అడిగి అడిగి చూశా
ఒక్క వరము ఇవ్వలే
లెక్కలేనన్ని వరములిచ్చే
ప్రేమ దేవత నీవులే
వింటే ఎవరైనా నిజమనుకుంటారులే
నువ్వే ఇచ్చావు నీ మనసుని కానుకే
అది నాలోన కాకుండా
నీ నీడలోనే క్షేమంగా ఉంటుందే
హాలి హాలి హాలీ
నన్ను కితకితలే పెడుతోంది గాలి
హాలి హాలి హాలీ
పూల పరిమళమై రేగింది ధూళి
తొలితొలిగా నా రెండు కన్నుల్లో
తడితడిగా తేనెల వానలే
తలమునకై ఆ తేనె వాగుల్లో
బతుకంతా తీపెక్కిపోయెనే
తెల్ల తెల్లటి హృదయమే
సిగ్గుతో ఎర్రగా మారెనే
నల్లా నల్లటి చీకటే
నవ్వులతో వెలిగింది నీ వల్లనే