ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆహ కళ్యాణ కాలం
ఆనంద నాదస్వరం… మోత మోగుతోందే
పందిళ్లు బందుజనం
ఊరంతా కోలాహలం… ఊయలూగుతోందే
ఏ, నిన్నల మొన్నల
అన్నుల మిన్నుగా ఎదిగిన కల్కి
బుగ్గన చుక్కగా మెరిసింది నేడూ
వన్నెల చిన్నెల కాటుక కన్నులా కలగా తొనికి
తొందర తొందర పడుతోంది చూడూ
చంద్రుని సోదరి ఈ సుకుమారి
శ్రీహరి గుండెలలో దేవేరి
మహారాణి నింగి మెరుపు
మనసేమో మల్లె తెలుపు
మహారాణి వలపు ముడుపు
మనువాడే వరుడి గెలుపూ
ఆహా ఈ బుట్టబొమ్మ… కట్టుకొచ్చింది చూడు
అమ్మ పట్టు చీర
భళిరా బంగారు బొమ్మ… ముస్తాబైంది నేడు
అత్తావారిల్లు జేరా
తద్దిన దిద్దిన మద్దెల శబ్దం
మంగళనాదం వీనుల విందుగా పాడే సంగీతం
అద్దరి ఇద్దరి అక్షతలేసి టెన్ టు ఫైవ్
పెద్దలు అంతా చల్లని దీవెనలు ఇచ్చే సుముహూర్తం
చక్కని జంటకిది శ్రీకారం
వెచ్చని ప్రేమకిది ప్రాకారం
మహారాణి నింగి మెరుపు
మనసేమో మల్లె తెలుపు
మహారాణి వలపు ముడుపు
మనువాడే వరుడి గెలుపూ
వెన్నెల సిరివెన్నెలా
ఎచటైనా పండుగ పంచదా
పుట్టింటికి మెట్టినింటికి మా అమ్మడు
విలువనే పెంచదా
హే, నువ్వు నేను తేడా లేదు
ఇద్దరొకటై కదలాలి
సంతోషాల చప్పట్లకు
చేతులు రెండు కలవాలి
ఎవరెక్కువ లెక్కలకు నేడే చెల్లు
అన్ని రంగులు కలిసినదే వాన విల్లు
వేరు మూలమెక్కడైనా… వారు వీరు ఒక్కటైతే
కాపురాలు కలల గోపురాలే
మహారాణి నింగి మెరుపు
మనసేమో మల్లె తెలుపు
మహారాణి వలపు
మనువాడే వరుడి గెలుపూ
మహారాణి నింగి మెరుపు
మనసేమో మల్లె తెలుపు
మహారాణి వలపు ముడుపు
మనువాడే వరుడి గెలుపూ