ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
గువ్వ గోరింకతో… ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో… మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వ లాగా… పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వ గోరింకతో… ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో… మ్రోగిందిలే వీణ పాట… ఆఆ హ ఆ
జోడు కోసం గోడ దూకే… వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం… తగుదులె తమరికి అబ్బాయిగారు
ఆత్రము అరాటము… చిందే వ్యామొహం
ఊర్పులో నిట్టూర్పులో… అంతా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు… చెరుకున్నానని నన్ను దోచెయ్యకు
చుట్టుకుంటాను సుడిగాలిలా…
గువ్వ గోరింకతో… ఆడిందిలే బొమ్మలాట
హొయ్… నిండు నా గుండెలో…
మ్రోగిందిలే వీణ పాట… హ హొయ్ హొయ్
కొండనాగు తోడు చేరే… నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో… ఉందిలె ఎంతో సంతోషం
పువ్వులో మకరందం… ఉందె నీ కోసం
తీర్చుకో ఆ దాహము… వలపే జలపాతం
కొంచమాగాలిలే కోరిక తీరెందుకు
దూముంటానులే… దగ్గరయ్యెందుకు
దాచిపెడతాను నా సర్వమూ…
గువ్వ గోరింకతో… ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో… మ్రోగిందిలే వీణ పాట
ఆడుకోవాలి గువ్వ లాగా… పాడుకుంటాను నీ జంట గోరింకనై