Menu Close

Gira Gira Gira Song Lyrics In Telugu – Dear Comrade (2019) Movie

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా, దినుసే నలగా లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్…
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా… మనసే కరగా లేదులే…
హొయ్ హొయ్ హొయ్ హొయ్…
చినదేమో తిరిగే చూడదే… ప్రేమంటే అసలే పడదే, హోయ్…

గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా దినుసే నలగా లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్…
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా
మనసే కరగ లేదులే…
హొయ్ హొయ్ హొయ్ హొయ్…

అలలు అలిసి చతికిలపడునా… కలలు నిలిచి కలవరపడునా
సహజ గుణము నిమిషము విడునా… ఏమి జరిగినా
మనసునెపుడు వదలని తపన… వినదు అసలు ఎవరేమనినా
గగనమొరిగి తనపై పడినా… ఆశ కరుగునా…

వేసవిలోన పెనుతాపం… ఓ ఆరాటంలా
నింగిని తాకి దిగి రాదా వర్షంలా… ఊఉ

గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా దినుసే నలగా లేదులే
సన్నాయి డోలు పెళ్లిపాట పాడే… అబ్బాయి ఓరకంట చూస్తున్నాడే
బంగారు బొమ్మ తలఎత్తి చూడే… నీ ఈడు జోడే అందాల చందురుడే…

ఎవరికెవరు తెలియదు మునుపు… అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదే… మనని వదులునా…
ఎదురుపడిన క్షణమొక మలుపు… అడుగు కలిపి కదిలితే గెలుపు
దిశలు రెండు వేరై ఉన్నా… పయనమాగునా…

నేనంటే తానే… తను నేనే… ఒకటై ఉన్నానే…
పొమ్మన్నా పోనే… పడతానే లేస్తానే…

గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా, దినుసే నలగా లేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్…
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా… మనసే కరగా లేదులే…

Like and Share
+1
3
+1
18
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading