ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదు
ఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయం
నీడలా జ్ఞాపకం వదలదు… తోడుగా ఏ నిజం నడవదు
ఒంటిగా సాగడం తప్పదు… జరిగే పయనం
నీతోనే మొదలైందా… నీతోనే ముగిసిందా
ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదు
ఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయం
ఇదే కదా కోరిందని… వేరే ఇంకేం కావాలని
అన్నామంటే ఈనాటికి… రేపంటు ఉంటుందా
ఇవ్వాళెంతో బాగుందని… అయినా ఏదో లోటుందని
ఇంకా ఏదో కావాలని… అనుకోని రోజుందా
కనకే మన ఈ గమనం…
ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదు
ఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయం
ఓఓఓ ఓహో హోహో… ఓఓఓ ఓహో హోహో
నీ ఊపిరే నీ తోడుగా… నీ ఊహాలే నీ దారిగా
నిన్నే నువ్వు వెంటాడక… ఏ తీరం చేరవుగా
కష్టాలనే కవ్వించగా… కన్నీళ్ళనే నవ్వించగా
ఇబ్బందులే ఇష్టాలుగా… అనుకుంటే చాలు కదా
కనకే మన ఈ పయనం…
ఎప్పుడూ ఒకలా ఉండదు… ఎక్కడా ఆగిపోనివ్వదు
ఎదరేమున్నదో చెప్పదు… కదిలే సమయం
నీతోనే మొదలైందా… ఓ ఓ
నీతోనే ముగిసిందా… ఆ ఆ