ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే… వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ… అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ
కోట్లిస్తది కోడిని కోసిస్తే… మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ…
అమ్మోరికి అవ్వాలని మేత… ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ…
అమ్మోరికి అవ్వాలని మేత… ఏనాడో రాసేసిన రాత
ఎలుగుందా రేతిరి గడిసాక హోయ…
చుట్టూతా కసి కత్తుల కోట… ఏ దారీ కనిపించని సోట
కునుకుండదు కంటికి… ఏ పూట ఓయ
ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే… వాకిండ్లకు మావాకులు గుచ్చే
అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ… అమ్మోరికి ఆకలి గురుతొచ్చే ఓయ
కోట్లిస్తది కోడిని కోసిస్తే… మేళ్ళిస్తది మేకను బలి ఇస్తే
పోలమ్మకు పొట్టేలును ఏస్తే ఓయ…
దండాలమ దండాలమ తల్లే… నీ యేటను తెచ్చేసాం తల్లే
కోబలి అని… కొట్టేస్తాం తల్లే ఓయ