Menu Close

Nenu Nuvvantu Lyrics in Telugu – Orange – నేను నువ్వంటూ వేరై ఉన్నా

Nenu Nuvvantu Lyrics in Telugu – Orange – నేను నువ్వంటూ వేరై ఉన్నా

నేను నువ్వంటూ వేరై ఉన్నా… నా-కీవేళా నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా… నా కోసం నేనే వెతికేంతగా
ఓ గర్ల్… నువ్వే లేకుంటే
లిసన్ గర్ల్… ఏమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా… కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా…

ఒకసారి చూసి నే వలచానా… నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా… గా ఘా
నా ప్రేమలోతులో మునిగాకా… నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేగంగా…

ఓ ఓ… నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా… అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా… ఓ ఓ

నిజాయితీ ఉన్నోడినీ… నిజాలనే అన్నోడినీ
అబద్దమే రుచించనీ అబ్బాయినీ..!
ఒకే ఒక మంచోడినీ… రొమాన్సులో పిచ్చోడినీ
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ..!!

ముసుగేసుకోదు ఏనాడూ… ఓ
నా మనసే ఓ భామా… ఓ
నను నన్నుగానే చూపిస్తూ… ఓ
కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓ ఓ…

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా… అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా…

తిలోత్తమా తిలోత్తమా… ప్రతీక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే… నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా… దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా..!!

ఒకనాటి తాజ్ మహలైనా… నా ముందూ పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై…
లోకంలో నిలిచే పేరే నాదేలే… ఓఓ ఓ

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళా నీలో నేనున్నట్టుగా… అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా…

నువ్వే లేకుంటే… ఏమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా… కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా…

ఒకసారి చూసి నే వలచానా… నను వీడిపోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా… గా ఘా
నా ప్రేమలోతులో మునిగాకా… నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేగంగా…
ఓఓ… ఓఓ… నానానా… నానన్నాన్నా
నానానా… నానన్నాన్నా………………

Nenu Nuvvantu Lyrics in Telugu – Orange – నేను నువ్వంటూ వేరై ఉన్నా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading