Menu Close

Usure Poyene Lyrics In Telugu – Villain – ఉసురే పోయెనె

Usure Poyene Lyrics In Telugu – Villain – ఉసురే పోయెనె

ఈ భూమిలో ఏప్పుడంట నీ పుటక… నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా… ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా… ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా

ఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే… ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా

ఉసురే పోయెనె ఉసురే పోయెనె… కదిలే పెదవులు చూడగనే
ఓఓ.. ప్రేమకు తపించి వేడుతు ఉన్నా… మనసుని ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్నా… హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి… అడుగుతు ఉన్నా ఉడుకు రుచి

ఒంటికి మనసుకు ఆమడ దూరం… కలిపేదెట్టా తెలియదుగా
మనసే చెప్పే మంచి సలహా… మాయ శరీరం వినదు కదా
తపనే.. తొలిచే… నా పరువము బరువు కదా
చిలిపి.. చిలకే… మరి నను దరికి ఉబికె కదా

ఈ మన్మధ తాపం తీరునా… ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా
ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా…
చందురుడు సూరీడు చుట్టి… ఒక్కచోట చేరిపోయే
సత్యమసత్యము… నేడు చీకటింటి నీడలాయే

ఉసురే పోయెనె ఉసురే పోయెనె… కదిలే పెదవులు చూడగనే
ఓఓ.. ప్రేమకు తపించి వేడుతు ఉన్నా… మనసుని ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్నా… హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి… అడుగుతు ఉన్నా ఉడుకు రుచి

ఇది కొత్త కాదు… పాతబడ్డ జగతికీ
తను కాచుకోదు… కళ్లులేని కట్టడిది
మనం చట్టమంటూ… గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో… లెక్కపెట్టి చూడు మరీ

మబ్బులు విడిచిన సూర్యుని చూసి… మొగ్గలు విచ్చును తామరా
దూరం భారం చూడనిదొకటే… నీకు పుట్టిన ప్రేమరా
పాపం వేరా అన్న తేడా తెలియదులే…
పామే అయినా… ఇక వెనకడుగుండదులే

చితి మంటలు రేగిన వేళలో… నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టి కలిసిన మదిలో నీవే…
చందురుడు సూరీడు… చుట్టి ఒక్కచోట చేరిపోయే
సత్యమసత్యము… నేడు చీకటింటి నీడలాయే

ఉసురే పోయెనె ఉసురే పోయెనె… కదిలే పెదవులు చూడగనే
ఓఓ.. ప్రేమకు తపించి వేడుతు ఉన్నా… మనసుని ఇవ్వవే మదనాల
అందని తీరాన నీవున్నా… హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి… అడుగుతు ఉన్నా ఉడుకు రుచి ||2||

Usure Poyene Lyrics In Telugu – Villain – ఉసురే పోయెనె

Like and Share
+1
2
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading