Endi kondaalu Eletoda Lyrics in Telugu – ఎండి కొండాలు ఏలేటొడా లిరిక్స్
ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
నాగభరణుడా నంది వాహనుడా
కేదారినాధుడా కాశీవిశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా ఓం కారేశ్వరా..
శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వరా…!!
ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే “2”
గండాదీపాలు ఘనముగా వెలిగించేరే..
గండాలు పాపమని పబ్బతులు పట్టేరే “2”
లింగానా రూపాయి
తంబాన కోడేను
కట్టినా వారికి సుట్టానీవే
తడిబట్ట తానాలు
గుడి సుట్టు దండాలు
మొక్కిన వారికీ దిక్కు నీవేలే
ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న
ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే “2”
కోరితే కొడుకులనిచ్చి
అడిగితే ఆడబిడ్డలనిచ్చే
తీరు తీరు పూజాలనొందే
మా ఇంటి దేవుడవే
ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా
నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే
నరులకు అందని నీ లీలలు సిత్రాలులే “2”
కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే “2”
నిండొక్క పొద్దులూ
దండి నైవేద్యాలు
మనసారా నీ ముందు పెట్టినమే
కైలాసావాసుడా
కరుణాలాదేవుడా
కరుణించమని నిన్నూ
వేడుకుంటామే
త్రిలోక పూజ్యూడా
త్రిశూల ధారుడా
పంచ భూతాలకు అధిపతివి నీవురా “2”
శరణని కొలిచినా
వరములనిచ్చే దొరా
అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా
దేవాను దేవుళ్లు మెచ్చినోడా
ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా
అనంత జీవకోటినేలినోడా
నీవు ఆత్మాలింగానివె మాయలోడా
కోటి లింగాల దర్శనమిచ్చెటోడా
కురవి వీరన్నవై దరికీ చేరీనోడా
నటరాజు నాట్యాలు ఆడెటొడా
నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా
నాగభరణుడా
నంది వాహనుడా
కేథారి నాథుడా
కాశీ విశ్వేశ్వరుడా..!!
భీమా శంకరా
ఓం కారేశ్వరా
శ్రీ కాళేశ్వరా
మా రాజరాజేశ్వర..!!
ఎండి కొండాలు ఏలేటొడా
అడ్డబొట్టు శంకరుడా
జోలే వట్టుకోనీ తిరిగెటోడా
జగాలను గాసే జంగముడా
కంఠాన గరళాన్ని దాసినొడా
కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా
ఆది అంతాలు లేనివాడా
అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా.. ..
Endi kondaalu Eletoda Shivarathri Song by Mangli
Endikondaalu Eletoda Lyrics
Endi kondaalu Eletoda Lyrics in Telugu – ఎండి కొండాలు ఏలేటొడా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.