Emantaro Lyrics In Telugu – Gudumba Shankar – ఏమంటారో నాకు నీకున్న ఇదిని లిరిక్స్
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కధని
ఏమంటారో జారిపోతున్న మదిని
చూసే పెదవిని మాటాడే కనులనీ
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసుని ఇదా అదా యధా విధా అని
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కధని
ఏమంటారో జారిపోతున్న మదిని
ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయినీ
తనువున తొణుకుతున్న చురుకుని
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్టకష్టాలనీ ఇపుడేమంటారో
ఈ మోహమాటాలనీ మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగినీ దొరలాంటి దొంగనీ
పాడే కొంగుని పరిమళించే రంగునీ
పొంగుతున్న సుధా గంగని
ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్న కధని
ఏమంటారో జారిపోతున్న మదిని
జాబిలై తళుకుమన్న చుక్కని
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ
దేవుడై ఎదుగుతున్న భద్దునీ
సూత్రమై బిగియనున్న సాక్షినీ
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో
గత జన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వునీ ఇక నీలో నేనునీ
మాకే మేమనీ మన దారే మనదనీ
రాసుకున్న ఆత్మచరితని
అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కధని
ఏమంటారో జారిపోతున్న మదిని.. ..
Emantaro Lyrics In Telugu – Gudumba Shankar – ఏమంటారో నాకు నీకున్న ఇదిని లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.