Menu Close

Malleswarive Lyrics In Telugu – Yuvasena – మల్లీశ్వరివే లిరిక్స్

Malleswarive Lyrics In Telugu – Yuvasena – మల్లీశ్వరివే లిరిక్స్

వాచ్ ఆన్……

ఆ ఆ ఆ…
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే… మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో, తేనెటీగవో… తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో, వెండి మంటవో… తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ… హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే… చురకత్తుల చూపులున్నా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే… మగశ్వాసల అంజలివే… ఓఓ

నీ కళ్ల నింగిలో… పున్నాల పొంగులో
వేవేల తారకలే… జలకమాడుతున్నవో
నాలోని కోరికలే… మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో… కెంజాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే… మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం…. ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో… చూపుతోందె సోయగమా

బేబీ……

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే… మగశ్వాసల అంజలివే… హో

బేబీ రన్ యువర్……

కొల్లేటి సరస్సులో… తుళ్లేటి చేపలై
రంగేళి కులుకులెన్నో… తళుకులీనుతున్నవే
నాకొంగ జపము చూచి… ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో… ఎరవేసి నన్నిలా
ఏ వైపు చూపు తిప్పనీక… చంపుతున్నవే
వదలదే హృదయం… కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము… తెలపవె సౌందర్యమా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే… మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో, తేనెటీగవో… తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో, వెండి మంటవో… తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ… హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే… చురకత్తుల చుపులున్నా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే… మగశ్వాసల అంజలివే… హో.. ..

Malleswarive Lyrics In Telugu – Yuvasena – మల్లీశ్వరివే లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading