Menu Close

Dragon Fruit Benefits in Telugu – డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Dragon Fruit Benefits in Telugu – డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క ను హైలోసెరియస్ కాక్టస్ (Hylocereus cactus) అని అంటారు. ఈ పండు యొక్క పువ్వులు కేవలం రాత్రి పూటనే పూస్తాయి. ఈ పండును పిటాయా (pitaya) మరియు పిటాహయ(pitahaya) అని కూడా పిలుస్తారు. ఈ పండు యొక్క ఆకారం డ్రాగన్ మాదిరిగా ఉందని డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తారు.

గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ పండు యొక్క క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ పండు ఎక్సోటిక్ గా ఉన్నా ప్రస్తుతం ఇది ప్రపంచం మొత్తం లో అన్ని ప్రదేశాలలో దొరుకుతుంది. ఈ పండులో ప్రస్తుతం రెండు రకాలు ఉన్నాయి.

1) మొదటి వెరైటీ ఎర్ర తోలు కలిగి, లోపలి భాగంలో మాత్రం తెల్లని గుజ్జు మరియు నల్ల రంగు లో గింజలు ఉంటాయి. వీటిలోనే కొన్ని ఎర్ర గుజ్జు మరియు నల్లని విత్తనాలు కలిగి ఉంటాయి.

2) ఈ రెండవ వెరైటీ లో పండు యొక్క చర్మం పసుపు రంగు లో మరియు పండు లోపలి గుజ్జు తెల్లగా మరియు నల్లని విత్తనాలు ఉంటాయి.

Dragon Fruit Benefits in Telugu

డ్రాగన్ ఫ్రూట్ లో ప్రతి 100 గ్రాములకు కింద చూపిన విధంగా పోషక విలువలు

పేరు మొత్తం 
శక్తి (Energy) 264cal
ప్రోటీన్ (Protein)3.57g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)82.14g
ఫైబర్ (Fiber)1.8g
షుగర్ (Sugars)82.14g
కాల్షియం (Calcium)107mg
సోడియం (Sodium)39mg
విటమిన్ C (Vitamin C)6.4mg

అద్భుతమైన డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు

  • డ్రాగన్ ఫ్రూట్ లో మంచి పోషక విలువలు మరియు న్యూట్రియంట్లు ఉంటాయి.
  • డ్రాగన్ ఫ్రూట్ ఒక మంచి ఆంటీ యాక్సిడెంట్
  • డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లను తగ్గించటంలో సహాయపడుతుంది
    4.డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ మరియు గట్ యొక్క ఆరోగ్యానికి సహాయ పడుతుంది
  • డ్రాగన్ ఫ్రూట్ మన ఇమ్యూన్ సిస్టం ను బలపరచటం లో సహాయపడుతుంది
  • డ్రాగన్ ఫ్రూట్ మన శరీరంలో ఐరన్ స్థాయిని పెంచటంలో సహాయపడుతుంది
  • డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం పలు రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
  • డ్రాగన్ ఫ్రూట్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • డ్రాగన్ ఫ్రూట్ చర్మానికి సంబంధించిన సమస్యలనుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
  • డ్రాగన్ ఫ్రూట్ కాన్సర్ నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది

డ్రాగన్ ఫ్రూట్ ఒక మంచి ఆంటీ యాక్సిడెంట్: ఆంటీ యాక్సిడెంట్ లు మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో సహజంగా అధిక మొత్తంలో ఆంటీ యాక్సిడెంట్ లైన బీటాసియానిన్స్ (betacyanins), పోలీఫెనోల్స్ (polyphenols) ఉంటాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ ను, డయాబెటిస్ ను, పేగు సమస్యలను, కోలన్ కాన్సర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లను తగ్గించటంలో సహాయపడుతుంది: ఎలుకల పై జరిగిన ఒక పరిశోధన ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రించటంలో సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ ను 250 మరియు 500 mg/kg శరీర బరువు కి ఇవ్వటం జరిగింది. ఫలితంగా బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ఘననీయంగా తగ్గాయి.

ఒక అధ్యయనం ప్రకారం 14 మగ మరియు 14 ఆడ వారిని 4 గ్రూపులుగా విభజించారు. వీరికి 7 వారాల వరకు డ్రాగన్ ఫ్రూట్ ను ఇవ్వటం జరిగింది. 7 వారాల తర్వాత వీరిలో LDL ఫ్యాట్ అంటే చెడ్డ ఫ్యాట్ తగ్గటం మరియు HDL అంటే మంచి ఫ్యాట్ పెరగటం గమనించటం జరిగింది.

డ్రాగన్ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ మరియు గట్ యొక్క ఆరోగ్యానికి సహాయ పడుతుంది: మన శరీరంలో మంచి మరియు చెడు రెండు రకాల బాక్టీరియాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ (ప్రీ బయాటిక్స్) మన శరీరంలోని గట్ బాక్టీరియా ఎదుగుదల మరియు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఫైబర్ ను మన జీర్ణ వ్యవస్థ జీర్ణించుకోలేదు కానీ గట్ లో ఉండే మంచి బాక్టీరియా మాత్రం ఈ ఫైబర్ ను జీర్ణించుకుంటుంది. ఈ బాక్టీరియా వివిధ రకాల రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ మంచి గట్ బాక్టీరియా లైన లాక్టోబేసిల్లి (lactobacilli) మరియు బిఫీదోబాక్టీరియా (bifidobacteria) యొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ మన ఇమ్యూన్ సిస్టం ను బలపరచటం లో సహాయపడుతుంది: డ్రాగన్ ఫ్రూట్ లో అధిక మొత్తం లో విటమిన్ C ఉంటుంది. విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థ ను బలపరచటంలో సహాయపడుతుంది. విటమిన్ C ఒక మంచి ఆంటియాక్సిడెంట్, మన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

Dragon Fruit Benefits in Telugu

డ్రాగన్ ఫ్రూట్ మన శరీరంలో ఐరన్ స్థాయిని పెంచటంలో సహాయపడుతుంది: డ్రాగన్ ఫ్రూట్ లో మన శరీరానికి అవసర పడే ఐరన్ మంచి మోతాదులో ఉంటుంది. మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా కోసం ఐరన్ చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకొనే ఐరన్ మోతాదు లో 70% రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మన శరీరంలోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం పలు రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: 18 సంవత్సరాలు వయసు దాటిన వారు ఒక రోజుకి 400 మిల్లి గ్రాముల మెగ్నీషియం తీసుకోవాలి. సహజంగా దొరికే ఆహారపదార్థాలలో మెగ్నీషియం ఉంటుంది, కానీ ఈ రోజుల్లో మన ఆహార అలవాట్లు మారిపోవటం వల్ల మన శరీరంలో మెగ్నీషియం కొరత ఏర్పడుతుంది. ఒక 170 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ లో 68 మిల్లి గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

దాదాపు మూడు లక్షల మంది ఆరోగ్యవంతులు మరియు డయాబెటిస్ తో భాదపడుతున్న పది వేల మంది పై జరిపిన ఒక పరిశోధన ప్రకారం మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల టైపు 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గించటంలో సహాయపడుతుందని తేలింది. మెగ్నీషియం తక్కువ తీసుకోవటం వల్ల మెగ్నీషియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఫలితంగా గుండెకు, ఎముకలకు, శ్వాస కోశ కు మరియు మెదడుకు సంబంధించిన జబ్బులకు దారి తీస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: వయసుతో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం మరియు కాల్షియం శరీరంలోని ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది .

డ్రాగన్ ఫ్రూట్ చర్మానికి సంబంధించిన సమస్యలనుంచి కాపాడటంలో సహాయపడుతుంది: డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఆంటియాక్సిడెంట్ లు చర్మ ఆరోగ్యానికి సహాయపడుతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C యూవీ రేడియేషన్ నుంచి మరియు డ్రై స్కిన్ లాంటి సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. విటమిన్ C కొల్లాజిన్ అనే ప్రోటీన్ ను తయారు చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది మరియు వృద్ధాప్యం లో చర్మం లో వచ్చే మార్పుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ కాన్సర్ నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది: డ్రాగన్ ఫ్రూట్ ఒక మంచి ఆంటియాక్సిడెంట్. ఈ పండు లో ఉండే లైకోపీన్ (Lycopene) అనే ఆంటియాక్సిడెంట్ క్యాన్సర్ నుంచి కాపాడటం లో సహాయపడుతుంది.

Dragon Fruit Benefits in Telugu – డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks