ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Dorakuna Ituvanti Seva Lyrics In Telugu – Sankarabharanam
దొరకునా,ఆ… దొరకునా, ఆఆ ఆ… దొరకునా ఆఆ ఆ ఆ
దొరకునా ఇటువంటి సేవ… దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై… నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆఆ ఆ..ఆఆ ఆ, ఆ ఆ ఆఆ
ఆ ఆఆ..! నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిను కొల్చు వేళ దేవాధి దేవా
దేవాధిదేవా, ఆఆ ఆఆ ఆ ఆ
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
దొరకునా ఇటువంటి సేవా
ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులె మృదంగాలు
ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులె మృదంగాలు
నాలోని జీవమై… నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా, మహానుభావా
దొరకునా —సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
దొరకునా ఇటువంటి సేవా
దొరకునా ఇటువంటి సేవా