Menu Close

Coffee Dandakam Lyrics in Telugu – Mithunam

Coffee Dandakam Lyrics in Telugu – Mithunam

అనుదిన్నమ్మును కాఫీయే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కూ
అమృతమన్నది హంబక్కు అయ్యలారా… 
జై కాఫీ
                         
విశ్వంతరాలలో ఉన్న బ్రహ్మాండ గోళాలలో
నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ
నాల్కతో  నీకు జే జేలు పలికేము నానాటికీ….
ఎర్లి మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్లైనాయున్ త్రోమకున్
తాగు బెడ్ కాఫీ కోసంబు  పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టెస్టిశ్వరీ..

బ్రష్ కాఫీశ్వరీ  నెట్స్ కేఫీశ్వరీ జిహ్వకున్ శుద్ది చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ

లోక ప్రాణేశ్వరీ  ప్రాణ దానేశ్వరీ  గంటగంటా
ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పాణేశ్వరీ… 
స్టీలు ఫిల్టర్ల పల్లెంబులోనున్న రంధ్రాలో నుండి  నీ సారమంత సుతారంగ
జారంగ నోరూరుచూడంగ నాసామి రంగా నిజంగానే చచ్చే విధంగా
కాస్త తాగన్  పునర్జన్మ వచ్చేవిధంగా

ప్రొద్దు పొద్దున్ననే నీ పొందులేకున్న
మూడంత పాడయ్యి టైమంత వేస్టయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి
అశ్లీల సంభాషణల్  చేసి
కాంటాక్ట్సు సర్వమ్ము నాశమ్ము కావించుకుంటారుగా                
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకొంటారుగా,
దాచుకొంటారుగ, కాచుకొంటారుగ
చచ్చినట్టింకా ఇచ్చేంతసేపందరున్  వేచి ఉంటారుగా

కాఫీనంతెత్తు పైనుంచి
ఓ కప్పులో వంచి ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచునురుంగు
ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా
                          
గొప్పనిష్టాగరిష్ఠుల్ భరిస్తాలలోలన్  గరిష్టంబుగా
కాఫీ తాగెందుకు ఇష్టంబుగా పోవుగా
షాపు మూసేయా వాపోవుగా                 
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ సుభాంగీ ప్రభాంగీ
నమస్తే నమస్తే… నమహా…

Coffee Dandakam Lyrics in Telugu – Mithunam

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading