Chinni Ma Bathukamma Song Lyrics – చిన్ని మా బతుకమ్మ లిరిక్స్
Chinni Ma Bathukamma Song Lyrics written by Kandikonda, sung by Telu Vijaya & Kandukuri Shankar Babu, and music composed by Suresh Bobbili, V6 Bathukamma song 2015 lyrics.
చిన్నీ మా బతుకమ్మ… చిన్నారక్క బతుకమ్మ
దాదీ మా బతుకమ్మ… దామెర మొగ్గల బతుకమ్మ
తంగెడు పువ్వులు తళతళ మెరిసే
వాడ వాడంతా ఓ పువ్వుల వనమాయే
ప్రతి ఊరి చేరివేమో… ఓ పువ్వుల తోటాయే
గూనుగు పువ్వులు మిలమిల మెరిసే
వాడ వాడంతా ఓ పువ్వుల వనమాయే
ప్రతి ఊరి చేరివేమో… ఓ పువ్వుల తోటాయే, ఆ ఆఆ ఆ
పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది
హే, ఆడబిడ్డలు ఇంటింట నిండే
అమ్మ నాన్న గుండెంత పొంగే
సత్తు పిండి సకినాలు చూస్తే
నోటినిండా ఊరిళ్లు ఊరే
పొద్దు పొద్దున్నే తమ్ముళ్లు లేచి
పూలకోసం బైలెల్లి ఉరికే
చాప పరిచీ వాకిళ్లలోనా
చెల్లెల్లంతా బతుకమ్మ పేర్చే
పచ్చ పచ్చని పల్లె… పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ… వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది
ఏలా ఏలా, ఏలెలా ఏలా ఏలా
ఏలెలే ఏలే ఏలా, ఏలెలా ఏలేలా ఏలా
ఏలా ఏలా, ఏలెలా ఏలా ఏలా
ఏలెలే ఏలే ఏలా… ఏలెలా ఏలేలా ఏలా
అగ్గో చింతలు పూసే సింతలు గాసే
ఓ లాలి గుమ్మడి… ఓ లాలీ ముద్దుల గుమ్మడి
(ఓ లాలీ ముద్దుల గుమ్మడి)
భలే, చినుకూ కురిసి… పుడమి మురిసే
ఓ లాలి గుమ్మడి… ఓ లాలీ ముద్దుల గుమ్మడి
(ఓ లాలీ ముద్దుల గుమ్మడి)
మట్టి వాసన మనసును తాకే
పంటా పొలము పచ్చగ నవ్వే
పక్షీ ఎగిరి పరుగూ తీసే
పశువులన్నీ సింధులు వేసే
హే, నింగీ నేల ఊరు వాడ
పరవశించి పండుగ జరిపే
పచ్చ పచ్చని పల్లె… పచ్చాని పల్లె
మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు వెట్టింది
అందాల బొడ్డెమ్మ… వాకిట్లో వెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది
హే బతుకమ్మ నెత్తికెత్తి
ప్రతి వాడ వాడ కదులుతుంటే
చూడ రెండు కళ్ళు చాలవసలే పూల నదులే
ఊరి చెరువు కట్ట కాడ
మన అక్క చెల్లెళ్లంత చేరి
ఆడిపాడుతుంటె మది మురిసే, కళ్ళు తడిసే
హే, పాత ఇనుప సందుగలో
ఉన్న కొత్త బట్టలే… ఒంటి పైకి వచ్చేసి
గల్లీ గల్లీ ఊరేగే… హా ఆ ఆఆ ఆ ఆ ఆ
హే,పున్నామా పున్నామా… నిండు పున్నామా
సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
(సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో)
ఇగా, రంగు రంగు పూలుదెచ్చి రాసుల్లు పోసే
సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో)
అగో, తీరొక్క పూలతోటి… అందంగా వేర్చే
సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో
(సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో)
మనకు బతుకునిచ్చు బతుకమ్మను
భక్తితోటి గొలిసే
సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో)
హే, పూలన్నీ పులకించే… మట్టి మనషులాట
పుడమినంత ఆడించె… చమట చుక్క పాట
రాలే కన్నీరు నవ్విందీ పూటే
అక్కా అందుకుంది… ఉయ్యాల పాటే
కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే
బడికీ పోయె చెల్లి… బతుకమ్మనెత్తె
పడి లేచే పాపలు… పండు ముసలి తాతలు
చేసే సంబురాలు ఈ రోజే
మా భూమాత గారాల… అందాల తనయీ
నాగమాల్లేలో మా తీగమాల్లేలో
(సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో)
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో)
మమ్ము కరుణించి… కాపాడు బతుకమ్మ తల్లి
నాగమాల్లేలో మా తీగమాల్లేలో
(సిరిమాల్లేలో మా రాగిమాల్లేలో)
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో)
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో)
(సిరిమాల్లేలో మా బొండుమాల్లేలో).. ..
Chinni Ma Bathukamma Song Lyrics – చిన్ని మా బతుకమ్మ లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.