Menu Close

ప్రతి ఇంట్లో వుండాల్సిన వస్తువు
అమెజాన్ ఆఫర్ - జస్ట్ 459
Body Weight Machine 👇

Buy Now-ఇప్పుడే కొనండి

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Bathukamma in Telugu – 9 రోజుల పండుగ – బతుకమ్మ పండుగ గురించి ఆసక్తికర విషియాలు

Bathukamma in Telugu – బతుకమ్మ పండుగ

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు జరుపుకునే పుష్పవల్లుల పండుగ “బతుకమ్మ పండుగ”. తెలంగాణ రాష్ట్ర పండుగగా 2014 June 16 న బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

O Nagadarilo Bathukamma Lyrics - Madhu Priya - 2022

History of Bathukamma – బతుకమ్మ పండుగ చరిత్ర

బతుకమ్మ పండుగకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మార్కండేయ పురాణం గాథా సప్తశతి లోని ఒక కథ ప్రకారం, మహిషాసురున్ని సంహరించి బాగా అలసిపోయిన గౌరీదేవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున నిద్రించి, దశమి నాడు మేల్కొంటుంది. గౌరీ మాత లేవగానే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన రాక్షస పీడితులందరు గౌరీ దేవి దయ వల్ల తిరిగి బ్రతుకుతారు. అప్పటినుండి తొమ్మిదిరోజులు గౌరీ దేవిని పూలతో అలంకరించి బతుకమ్మ పేరుతో పూజించటం సంప్రదాయంగా మారింది.

ఇలా ప్రచారంలో ఉన్న ఇంకొక కథ ప్రకారం, “ఒక బాలిక” భూస్వాముల అఘాయిత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాలిక గుర్తుగా ఆ గ్రామస్తులు “బతుకమ్మ” పేరుతో ఉత్సవం జరపటం జరుగుతూ వస్తుంది.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

ఇంకొక కథ ప్రకారం దక్షిణ భారతదేశానికి చెందిన చోళ చక్రవర్తి ధర్మాంగుడు, లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఒక అమ్మాయిని కుమార్తెగా పొందుతాడు. ఆ అమ్మాయికి “బతుకమ్మ” అని నామకరణం చేసి, తన రాజ్యంలో ప్రతీ సంవత్సరం ఆమె పేరుమీదుగా 9 రోజులు ఉత్సవాలు జరిపేవారని పురాణాలు చెపుతున్నాయి.

Bathukamma Preparation – బతుకమ్మను ఎలా పేర్చాలి

ఇలా తయారు చేసిన బతుకమ్మను సాయంకాలం ఆరుబయట ఉంచి, చుట్టూ మహిళలు, అమ్మాయిలు చప్పట్లు కొడుతూ, తిరుగుతూ, జానపదాలు పాడుతూ పరవశిస్తారు.

గుమ్మడి పూవులు + గుమ్మడి ఆకును ఇత్తడి స్తాంబాలంలో క్రింది వరుసలో ఉంచుతారు. వాటిపైన గునుగు పూలు, చామంతి పూలు, బంతిపూలు వరుసలో పేరుస్తారు. పైన పసుపు ముద్దతో గౌరమ్మను చేసి దీపం పెట్టి పూజిస్తారు.

Bathukamma in Telugu (4)

సద్దుల బతుకమ్మ రోజు చీకటిపడిన తర్వాత బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. చక్కర, జొన్నరొట్టెతో చేసిన మలిద ముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తారు.

ఈ పండుగ జరిపే తొమ్మిది రోజులను తొమ్మిది పేర్లతో పిలుస్తారు.

Nine Days in Bathukamma Festival – తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లు

మొదటి రోజు – ఎంగిలిపూల బతుకమ్మ:
పెత్తరమాస నాడు దీన్ని జరుపుకుంటారు, ఈ రోజు పెద్దలకు పూజించి బ్రాహ్మణులకు బియ్యం మరియు కూరగాయలు దానం చేస్తారు.
ముందురోజే పూలను కోసి తెస్తారు కాబట్టి ఈ రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. సాయంత్రం బతుకమ్మను చేసి మధ్యలో గౌరమ్మను ఉంచి, జానపదాలను పాడుతూ, ఆడుతూ మహిళలు బతుకమ్మను పూజిస్తారు, ఈ రోజు నువ్వులు+నూకలు+బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు.

అటుకుల బతుకమ్మ – రెండవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, సప్పటి పప్పు+బెల్లం+అటుకులు కలిపి ప్రసాదంగా ఉంచుతారు.

ముద్దపప్పు బతుకమ్మ – మూడవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, ఈ రోజు బెల్లం+పాలు ప్రసాదంగా ఉంచుతారు.

నానబియ్యం బతుకమ్మ – నాలుగవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, మానేసిన బియ్యం+బెల్లం ముద్దలుగా చేసి ప్రసాదంగా పెడతారు.

Bathukamma in Telugu (4)

అట్ల బతుకమ్మ – ఐదవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, అట్లు లేదా దోశలు ప్రసాదంగా పెడతారు.

అలిగిన బతుకమ్మ – ఆరవ రోజు:
ఈ రోజు బతుకమ్మ ఆడరు, మరియు ప్రసాదం ఉండదు కాబట్టి అలిగిన బతుకమ్మ అని అంటారు.

వేపకాయల బతుకమ్మ – ఏడవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, బియ్యం పిండిని వేపకాయలలాగా చేసి ప్రసాదంగా పెడతారు.

వెన్న ముద్దల బతుకమ్మ – ఎనిమిదవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, నువ్వులు+వెన్న+బెల్లం+నెయ్యి కలిపి ముద్దలుగా telugubucket.com చేసి ప్రసాదంగా పెడతారు.

సద్దుల బతుకమ్మ – తొమ్మిదవ రోజు:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, సద్దులైన పెరుగన్నం, పులిహోర, చిత్రన్నం, కొబ్బెరన్నం, నువ్వులన్నం వంటి 5 రకాల ప్రసాదాలు పెడతారు. కొందరు మలిద ముద్దలు కూడా పెడతారు.

Bathukamma in Telugu (4)

Science Behind Bathukamma Festival – బతుకమ్మ శాస్త్రీయత

బతుకమ్మలను చెరువులో నిమర్జనం చేయడంవల్ల తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలలో ఉన్న ఔషధ గుణాల వలన త్రాగు నీరులోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ ప్రసాదాల వల్ల Fe, Ca వంటి పోషక విలువలు మనకు లభిస్తాయి. సాయంత్రం బతుకమ్మ ఆడటం వల్ల మహిళల వ్యక్తిత్వ వికాసం, శారీరక పటుత్వం పెరుగుతాయి.

What is Bathukamma Festival in Telugu
Why Bathukamma Festival in Telugu
About Bathukamma Festival in Telugu
History of Bathukamma Festival in Telugu
Unknown facts of Bathukamma Festival in Telugu
Story of Bathukamma Festival in Telugu

Bathukamma in Telugu – 9 రోజుల పండుగ – బతుకమ్మ పండుగ గురించి ఆసక్తికర విషియాలు

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks