Menu Close

గ్యాస్ సిలిండర్ ని పైకి లేపకుండా.. లోపల ఎంత వరకు గ్యాస్ ఉందో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి.

Useful Tips in Telugu

గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం కొందరు బండను షేక్ చేసి చూడడం, లేదా పైకి ఎత్తి చూడడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది అన్ని సమయాల్లోనూ శ్రేయస్కరం కాదు.

ఈ చిన్న ట్రిక్ తో మీ బండ లో గ్యాస్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.

ఒక బౌల్ లో వాటర్ తీసుకోండి. ఒక క్లాత్ ను తీసుకుని దానిని వాటర్ లో ముంచి..

పూర్తి గా తడిసిన తరువాత బయటకు తీయండి. దానిని పిండి.. ఆ తడి గా ఉన్న గుడ్డతో బండను తుడవండి. ఒక నాలుగైదు నిమిషాల పాటు దానిని గమనిస్తే..

check gas cylinder weight

గ్యాస్ లేని భాగం లో తొందరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింద భాగం మాత్రం ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.

check gas cylinder weight

ఈ తడిగా ఉన్న ప్లేస్ ఎక్కడివరకు ఉందో… అక్కడవరకు మీ బండలో గ్యాస్ ఉందని అర్ధం. బండ ని పైకి లేపడం, వెయిట్ చూడడానికి ఆన్ లైన్ లో దొరికే రకరకాల మెజరింగ్ పరికరాలను ఉపయోగించడం అంత సేఫ్ కూడా కాదు.. చాలా సింపుల్ గా.. ఒక క్లాత్, వాటర్ తో ఈ ఎక్స్పరిమెంట్ ట్రై చేయచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఉండే బండలో ఎంత వరకు గ్యాస్ ఉందో చెక్ చేసుకుని అవసరమైనపుడు కొత్త బండ బుక్ చేసుకోవచ్చు.

Useful Tips in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading