Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
“ఏమే…సుమా…పొద్దున్నే..శుభమా అని పిల్లని…స్కూలు కి జాయిన్ చేయడానికి వెళ్తూ…ఆ పక్కింటి..మహిత .. ఎదురొచ్చి నా..అలాగే తీసుకెళ్ళి పోయావ్” అని అడిగింది… సుమ ను..ఆ పక్కింటి శ్యామల..”
ఏమో పిన్ని…పిల్లను స్కూలుకు వదిలే తొందరలో చూసుకోలేదు..” అంది సుమ…” పిల్ల బడి నుండి రాగానే..కాసింత ఉప్పు…ఎండు మిరపకాయలు…తీసుకుని దిష్టి తీసి పారెయ్” అంది ఆరిందలా ..శ్యామల…అప్పుడే అటుగా వచ్చిన మహిత చెవిన…పడ్డాయి ఈ మాటలు..కానీ..వినిపించనట్టుగా…వెళ్లిపోయింది….
బంధువుల శ్రీమంతం జరుగుతోంది….అందరు మహిత తో మంచిగా మాట్లాడుతున్నారు…కానీ…అక్కడ జరిగే తంతు లో..మహిత భాగస్వామ్యాన్ని…ఎవరు అంగీకరించలేదు…మహిత భర్త.. అజయ్… సూపర్ మార్కెట్ సొంతంగా పెట్టుకుని..ఆర్థికంగా బాగానే నిలదొక్కుకున్నాడు…స్థితిమంతులే….అన్నీ ఉన్నా..పిల్లలు లేని లోటు…ఎన్నో ఆసుపత్రులు తిరిగారు….ఎన్నో గుడులు తిరిగారు…చేయని పూజలు లేవు…కానీ ఫలితం లేకపోయింది..
పిల్లలు కలిగే అవకాశం ఇద్దరిలో ను లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్స్…పెళ్లయి..తొమ్మిది సంవత్సరాలు దాటుతోంది….ఇక ఈ విషయం లో దేవుడి నిర్ణయం ఇంతే..అని..ఇద్దరు..భార్య భర్త ఒకరికొకరు..అని..జీవితాంతం సంతోషంగా జీవించాలని నిర్ణయించేసుకొన్నారు…..
వాళ్లిద్దరూ సంతోషంగా నే ఉంటున్నా…చుట్టూ పక్కల వారి..సూటి పోటి.. మాటలు..మాత్రం మనసుకు ములుకుల్లా గుచ్చుతున్నాయి….సరిగ్గా అదే సమయంలో ….ఒక రోజు…తనకు తెలిసిన… స్టాఫ్ నర్స్ శృతి..తనకు ఫోన్ చేసి..అర్జెంటు గా హాస్పిటల్ కు రమ్మంది..,విషయం చెప్పలేదు….హడావిడి గా హాస్పిటల్ కు వెళ్ళిన మహిత కు శృతి ఎదురొచ్చి….ఒక గదిలోకి పిల్చుకు వెళ్ళింది…ఎవరో అనాధ స్త్రీ..పండంటి పాప ను ప్రసవించింది…తీవ్ర రక్తస్రావం తో చనిపోయింది….
ఆ పుట్టిన చిన్నారి.,ఇప్పుడు అనాథ….ఆ అమ్మాయిని తీసుకుని..పెంచుకుంటే మంచిది అని చెప్పింది శృతి….ఇలాంటి ఆలోచన లేని…మహిత..ఒక్కసారిగా తీవ్ర ఆలోచన లో పడింది…ఆ చంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే..మహిత లో ఏదో అవ్యక్త సంతోష అనుభూతి…అప్రయత్నంగా..కంటి నుండి..ఒలికిన కన్నీరు…వెంటనే తన భర్త ను అర్జెంటు గా హాస్పిటల్ కు పిలిపించింది…
అక్కడ విషయం మొత్తం చెప్పింది…అజయ్ మొదట తట పటాయించినా…ముద్దులు మూట గట్టే ఆ చిన్నారిని తమతో తీసుకెళ్ళి పోవాలి అనిపించింది….సంతోషంగా ఫార్మాలిటీస్ పూర్తి చేసి..చిన్నారి ని ఇంటికి తీసుకొచ్చి….” వర్ణిత” అని పేరు పెట్టారు..ఈ సారి వీధి లోని మనుషులు…వీరిని అదోలా చూస్తూ..చెవులు కొరక్కుంటున్నారు…అంతే…మహిత.. అజయ్ పాపతో..దూరంగా వేరే ఊరికి వెళ్లిపోయి ….ఇదే వ్యాపారాన్ని అక్కడ మొదలు పెట్టారు…
కొద్దిగా కొత్త వాళ్ళతో ప్రశాంతంగా అనిపించింది…చిన్నారి వర్ణిత….వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది…మహిత.. అజయ్ లు కూడా పెద్ద మనసుతో.. వార్ణిత ను ఆదరించడం…కొత్త జీవితాన్ని ఇవ్వడం… వల్ల..అనాధ అయిన… వర్ణిత జీవితం చక్కబడింది…..
లోకం లో మాతృత్వానికి నోచుకోని తల్లులు ఎందరో ఉన్నారు…అదే విధంగా తల్లిదండ్రులు లేక అనాధలు గా బతుకుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు…ప్రపంచం నిండా..అందరిలో.. ఎన్నో బాధలు…అయినప్పటికీ..సంతోషం గా జీవిస్తూ… ఉన్న జీవితాన్ని ప్రయోజనాత్మకం కా బతక గలగడం మానవ ధర్మం.
లోకం నిండా ఎందరో అనాథలు… మంచి..చెడు చెప్పే కుటుంబం లేకపోతే.. సమాజం లో ఎవరు ఎలా తయారు అవుతారో చెప్పలేము… అందుకోవడం లో తప్పు లేదు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.