అది ఒక పల్లెటూరు. అందులో అందరూ కూలీనాలీ చేసుకుని బ్రతికేవారే.
వరదయ్య ఒక్కడే ఆ ఊరిలోకి పెద్దరైతు. వారికి వందావులు ఉండటంచేత అందరూ వందావుల వరదయ్య అని పిలిచే వారు.
ఆయన భార్య వనమ్మ. చాలా మంచిది. దానధర్మాలు చేయడం లో ఆమెది ఎముకలేని చెయ్యి తెలతెలవారుతుండగా పనివారిచేత పాలు పిండించి “బిడ్డపాలు” అనేపేరుతో అందరి తల్లులకు పోయించేది.
“ఎంతయినా కడుపున పుట్టిన బిడ్డ కు పెంచుకున్న బిడ్డకు తేడాలేదా?” అనేది ఆమె.
కాలచక్రం తిరిగి పోతున్నది.
ఒకరోజు పొలంలో కుప్పనూర్పిడులు జరుగుతున్నాయి. అందరూ హడావుడిగా పనులు చేసుకుంటున్నారు.
అంతలో సంధ్యచీకట్లు అలముకుంటున్నాయి. వనమ్మ పొలంనుండి ఇంటికి వస్తున్నది. కాలుజారి దారిప్రక్కనే వున్న దిగుడు బావిలో పడిపోయింది. ఎదురుగా
వస్తున్న రాము అనే బాలుడు చూచి పెద్దగా కేకలు వేశాడు. పనివారు పరుగెత్తుకుంటూ వచ్చారు. జరిగింది చెప్పాడు.
వేంటనే కొంత మంది బావిలోనికి దూకి వనమ్మను బయటకు తీశారు.
వారు జరిగింది చెప్పారు. ఆమె కృతజ్ఞత నిండిన కళ్ళతో పిల్లవాడిని చూచి”బాబూ! ఎవరు నీవు?”
“అమ్మా! మీరు నాకు అమ్మ అవుతారు. మా అమ్మ నాకు రోజూ చెబుతుండేది. తమరు పోసిన ఆవుపాలు తాగి పెరిగానట, నాప్రాణం నిలిపిన అమ్మవు నీవు. నీప్రాణం నిలిపి కొంతయినా రుణంతీర్చుకోగలిగాను.” అన్నాడు రాము అమాయకంగా.
వనమ్మ మదిలో మాతృత్వం పొంగింది. వెంటనే రాముని ఇంటికి తీసుకుపోయి భర్తతో “ఏవండీ! నాకు పిల్లలు లేరనే బాధ నేటితో తీరిపోయింది. మన ఆవుపాలు త్రాగిన పిల్లలందరూ మన పిల్లలే అనుకుంటున్నాను. వారి హృదయాలలో నన్ను అమ్మగా భావించుకుంటున్నారు ఇంక నాకేం కావాలి” అంటూ పిల్లవాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడింది ఆమేకే కాకుండా భర్తకు కూడా కళ్ళనిండా నీళ్లు నిండాయి.
✍🏻జంజం కోదండ రామయ్య
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.