Avunani Antavo kadani antavo Lyrics In Telugu – Holi
ఔనని అంటావో… మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో… నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది… నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి… తేలని నిమిషంలో, ఓ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనీ
ఎలా చూపనమ్మా… నా ప్రేమ నువ్వనీ
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
చిగురాకుల లేఖలు రాసి… చిరు గాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను… నువ్వు చూడలేదా
నా మసనే పడవగా చేసి… కలలన్నీ అలలుగా చేసి
ఎపుడో నే పంపించాను… నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా… నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు… చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా… ఉండలేకపోతున్నా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనీ
ఎలా చూపనమ్మా… నా ప్రేమ నువ్వనీ
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ప్రేమన్నది ఊపిరి కాదా… అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే… వింతే కదా
నువ్వున్నది నాలోనేగా… ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా… ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే… నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా… పోల్చూకోవ నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనీ
ఎలా చూపనమ్మా… నా ప్రేమ నువ్వనీ
ఔనని అంటావో… మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో… నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది… నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి… తేలని నిమిషంలో, ఓ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనీ
ఎలా చూపనమ్మా… నా ప్రేమ నువ్వనీ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనీ
ఎలా చూపనమ్మా… నా ప్రేమ నువ్వనీ
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.