అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
అరె ఏమైందీ……!!
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది, ఆ ఆ ఆఆ
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
నింగి వంగి నేల తోటి… నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం… పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేను… పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు లేవు… నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళలోకి… ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి… కన్నమేసి వచ్చావో
అది దోచావూ… ఊఊ ఉ
లలలలా లలల లలల ల
లలలలా లలలలా లలల లలల ల
బీడులోన వాన చినుకు… పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా… పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు… గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే… పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత… దేవుడేమి రాశాడో
చేతనైతె మార్చి చూడు… వీడు మారిపోతాడు
మనిషౌతాడూ… ఊఊఉ ఊఉ
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ