Menu Close

అరవిందుని కథ – మొదటి సంచిక – పల్లెటూరి అందాలు – Beautiful Telugu Stories

పల్లెటూరి అందాలు – Beautiful Telugu Stories

Beautiful Telugu Stories: ఊరిలో అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతంగా అనిపించింది అరవింద్ కి. వేద మంత్రాలు, పడుచులకి అందకపోయినా ఓ చేత్తో పరికినీ పట్టుకుని ఎగిరెగిరి మరీ కొడుతున్న గుండిగంటలు శబ్దాలు, గుడి పక్కగా బండరాళ్లను దాటెండుకు ఎగిరిపడుతున్న సెలయేటి నీరు, ఆ నీటికి ఎదురీదుతున్న చేపపిల్లలు. వాటిని అందుకునేందుకు తదేకంగా వేచి చూస్తున్న తెల్లటి కొంగలు. అనుకోకుండానే కొంగలపై నుండి చూపు సెలయేటి గట్టుపై పడేంతలా గుబురుగా పెరిగినా వెదురు పొదలు. ఆ వెదురు గడలు ఎదురు గాలికి ఊగుతూ ఎవరు ఊదకుండానే తియ్యని రాగాలు కూడా వినిపిస్తున్నాయి.

అద్బుతంగా అనిపించింది అరవింద్ కి. ఇన్నాళ్ళు పట్నంలో పరుగులు పెట్టిన మనిషి కదా.. పల్లెటూరిలో అడుగు పెట్టగానే ఆ అపల్లెటూరి అందాలు అరవింద్ ని అక్కడే కట్టి పడేశాయి. అరవింద్ కూడా ఆదమరిచి అక్కడే నిలబడిపోయాడు. రైలుబండి కూతకు కానీ మెళుకువ రాలేదు. ఆ పక్క వూరిగుండా రైలుదారి వున్నట్టుంది. అక్కడి రైలుకూత ఇక్కడికి కూడా చక్కగా వినపడుతుంది.

aravinduni katha by suresh sarika train

ఇంతలో గుడినుండి ఇంటికి వెలుతున్న శారదమ్మకి అరవింద్ కనబడ్డాడు. ముఖం కొంచెం కొత్తగా కనిపించేసరికి ఏం బాబు వూరికి కొత్తగా వచ్చినట్టున్నావు. ఎవరింటికి వెళ్ళాలి అని నవ్వుతూ అడిగింది. సుబ్రమణ్యం గారింటికమ్మా ఆయన మా మామయ్యగారు అని అన్నాడు అరవింద్. ఓ అవునా సరే ఇలా తిన్నాగా వెళ్ళు, రామాలయం వస్తుంది ఆ పక్కన ఇళ్లే అని చెప్పింది శారదమ్మ. థాంక్స్ అమ్మ అని అరవింద్ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అడుగులు వేశాడు. సుబ్రమణ్యం గారి ఇల్లు వచ్చింది.

అరవింద్ గేటు దగ్గరే నిలబడి చూస్తున్నాడు. ఎవరు కనిపించడం లేదు లోపల. పల్లెటూరు కదా కొంచెం విశాలంగా వుంది ఇంటి ఆవరణం. గేట్ కి ఇంటి గుమ్మానికి దాదాపుగా 20 అడుగుల దూరం వుంటుంది.. ఎవరైనా బయటకొస్తారేమో అని గుమ్మంవైపే చూస్తున్నాడు అరవింద్. ఇంతలో అప్పుడే తలంటు పోసుకుని జుట్టుకి సాంబ్రాణి వేసుకుంటు బయటకి వచ్చింది మేఘనా. తూర్పు గుమ్మం కదా ఎదురు పొద్దు వల్ల సూర్య కిరణాలు సరాసరి మేఘన మీద పడుతున్నాయి.

aravinduni katha by suresh sarika home

హలో.. ! అంటూ అరవింద్ కొంచెం గట్టిగానే పిలిచాడు. జుట్టుని వెనకకు విసురుకుని తలెత్తి చూసింది మేఘన. ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నా పేరు అరవింద్, సుబ్రమణ్యం గారి ఇల్లు ఇదేనా.. అని అడిగాడు అరవింద్. అవును అంది మేఘన.. అరవింద్ గేట్ లోపలకి అడుగులు వేస్తూ నేను సులోచన గారి అబ్బాయిని అన్నాడు. అమ్మా..! అంటూ మేఘన లోపలకి పరిగెత్తింది.

సరాసరి వంటిటిలోకి వెళ్ళి అమ్మా.. అమ్మా.. అంటూ ఆయాసపడుతుంది. నీకెన్ని సార్లు చెప్పాలే తల తుడుచుకుంటూ వంటగదిలోకి రావోద్ధని, ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది లక్ష్మి (మేఘన అమ్మగారు, సుబ్రమణ్యం గారి భార్య). సులోచనత్తవాళ్ళ అబ్బాయంటమ్మా.. అంది మేఘన. ఏం అంటున్నవే అని అడుగుతూనే బయటకి వచ్చి అరవింద్ ని చూసింది. 25, 26 ఏళ్ల అరవింద్ తెల్లగా ఆరడుగుల ఆరడుగుల ఎత్తు కోలా ముఖం అచ్చం వాళ్ళ అమ్మలానే వున్నాడు అనుకుంది మనసులో..

ఎవరే పోద్ధు పోద్ధునే ఎంటా అరుపులు అంటూ తల తుడుచుకుంటూ వచ్చాడు సుబ్రమణ్యం. ఎదురుగా అరవింద్ ని చూసి మీరు అంటూ ఆగిపోయాడు. అరవింద్ ని చూడగానే తన చెల్లి సులోచనే గుర్తుకు వచ్చింది. నేను సులోచన గారి అబ్బాయిని అన్నాడు అరవింద్. సుబ్రమణ్యం గుండె బరువెక్కింది. 28 ఏళ్ల క్రితం దూరమైన బంధం మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగొచ్చిందనుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి సుబ్రమణ్యంకి. ఆప్యాయంగా అరవింద్ బుజాలను అందుకుని దగ్గరకి తీసుకున్నాడు. అమ్మ ఎలా వుందమ్మ అని అడిగాడు సుబ్రమణ్యం? ఈ సారి అరవింద్ కళ్ళు చెమ్మగిల్లాయి.

aravinduni katha by suresh sarika tears

రెండవ సంచికతో మళ్ళీ కలుద్దాం.. తప్పకుండా మీ అబిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. అలానే ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

రచయిత: సురేష్ సారిక
Source of the story – TeluguBucket.com

సరైన attributes లేకుండా ఈ పోస్ట్ ని కాపీ పేస్ట్ చెయ్యడం నిషిద్ధం. చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. షేర్ చేసేటప్పుడు రచయిత పేరు మరియు source of the story – TeluguBucket.com తప్పకుండా include చెయ్యండి.

Subscribe to Our YouTube Channel

Best Telugu Stories to Read, Telugu Stories by Suresh Sarika, Love Stories in Telugu, Romantic Stories in Telugu, Telugu Love Stories, Prema Kathalu, Web Series Stories in Telugu, Short Film Stories in Telugu.

Like and Share
+1
0
+1
6
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading