Menu Close

Andhaalalo Aho Mahodayam Lyrics in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Andhaalalo Aho Mahodayam Lyrics in Telugu

లాలాలలా లలా లలా లా… లాలాలలా లలా లలా లలా
లాలాలలా లలా లలా లా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
అందాలలో అహో మహోదయం… భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం… నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడే… సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి… వరించేలే సరాలతో
మిలా మిలా హిమాలే… జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన… తటిల్లదా హారాలుగా
చేతులు తాకిన కొండలకే… చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో… మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచీ… ఇల చేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం… భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం… నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం… తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో… మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే… మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే… దివి భువి స్పృషించనా
గ్రహములు పాడిన పల్లవికే… జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే… కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా… చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం… భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో… ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం… భూలోకమే నవోదయం..

Movie: Jagadeka Veerudu Athiloka Sundari – 09 May 1990
Director: K. Raghavendra Rao
Producer: C. Ashwini Dutt
Singers: S P Balasubramanyam, S Janaki
Music: Ilaiyaraaja
Lyrics: Veturi Sundararama Murthy
Star Cast: Chiranjeevi, Sridevi
Music: Label Aditya Music

Andhaalalo Aho Mahodayam Lyrics in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading