Menu Close

Abbani Thiyyani Debba Lyrics in Telugu – అబ్బనీ తియ్యనీ దెబ్బ

Abbani Thiyyani Debba Lyrics in Telugu – అబ్బనీ తియ్యనీ దెబ్బ

అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ…

వయ్యారాల వెల్లువ… వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా… పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చిటపట నడుముల ఊపులో… ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసి కసి వయసులో… ఒక ఎద నస పదనిస కలవుగా

కాదంటూనే కలబడు… అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు… తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా… వయసు నిలబడు కౌగిట…

అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ…

పురుషుల్లోన పుంగవా… పులకింతొస్తే ఆగవా
వయ్యారాల వెల్లువ… వాటేస్తుంటే వారెవా…

అబ్బనీ తియ్యనీ దెబ్బ…ఊహు..!  ఎంత కమ్మగా ఉందిరోయబ్బ…ఆహహ్హా
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ…

ఆ ఆ ఆఅ ఆ ఆఁ…

అడగక అడిగినదేమిటో… లిపి చిలిపిగా ముదిరిన కవితగా…
అది విని అదిమిన షోకులో… పురి విడిచిన నెమలికి సవతిగా..

నిన్నే నావి పెదవులు… అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు… అవి రేపవ్వాలి మనువులు…
వస్తా వలచి వస్తా… మనకు ముదిరెను ముచ్చట…

అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ…

పురుషుల్లోన పుంగవా… పులకింతొస్తే ఆగవా
వయ్యారాల వెల్లువ… వాటేస్తుంటే వారెవా…

అబ్బనీ తియ్యనీ దెబ్బ… ఎంత కమ్మగా ఉందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ… ఎంత లేతగా ఉన్నదే మొగ్గ…

Movie: Jagadeka Veerudu Athiloka Sundari (09 May 1990)
Director: K. Raghavendra Rao
Singers: SP Balasubramaniam, KS Chithra
Music: Ilaiyaraaja
Lyrics: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Sridevi
Producer: C. Ashwini Dutt
Music Lable: Aditya Music

Abbani Thiyyani Debba Lyrics in Telugu – అబ్బనీ తియ్యనీ దెబ్బ

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks