ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
అమృతానికి అర్పణకు… అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టుకకి… పట్టుగొమ్మ అమ్మ
ఈ లోకమనే గుడిచేరగ… తొలి వాకిలి అమ్మ
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
అమృతం అన్ననేమి… బ్రతుకు నిలుపు జలమే
ఆకలి దప్పి తీర్చు… వట్టి జీవరసమే
అమృతం అమ్మతో త్రాసును తూగితే
మమతల బరువుతో అమ్మే నిలుచురా
ప్రేమే తొలికే రసకలశం
అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా
అమ్మే కాదంటే అది జన్మే కాదురా
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియునా
గుడిలో ఉంటే ఆ కమ్మదనం తెలియునా
అని ఆ శ్రీహరే అమ్మ ఒడి చేరెరా
పది రూపాలతో కట్టుబడి పోయెరా
స్వార్ధం లేని పరమార్ధం
అమ్మే నా గర్వం… ఆ అమ్మే నా సర్వం
అమ్మే నా దుర్గం… ఆ అమ్మే నా స్వర్గం