Vintunnava Lyrics In Telugu – వింటున్నావా – Em Maya Chesave
పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా… మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా… వింటున్నావా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా… వింటున్నావా
వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో… పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓహో… బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఏమో ఏమో ఏమవుతుందో… ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా… వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా… నేనలా తేలి ఆడుతుంటే
నన్నే నాపై నువ్వే రాసినా… ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా… వింటున్నావా
వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
కలలను కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలంతోన పుట్టింది కాలంలా మారే
మనసే లేనిది ప్రేమా
రా ఇలా కౌగిళ్ళలో… నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని తలువని వేళలలోనా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా… వింటున్నావా
విన్నా వేవెల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియ చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ ఓ… బతికుండగా నీ పిలుపులు నేను విన్నా.. ..
Vintunnava Lyrics In Telugu – వింటున్నావా – Em Maya Chesave
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.