Menu Close

Allah Sri Rama Song Lyrics In Telugu – శుభకరుడు సురుచిరుడు లిరిక్స్ – Sri Ramadasu – Subhakarudu Surucharudu Lyrics

Allah Sri Rama Song Lyrics In Telugu – శుభకరుడు సురుచిరుడు లిరిక్స్ – Sri Ramadasu – Subhakarudu Surucharudu Lyrics

అల్లా…
శ్రీ రామా… ఆఆ ఆ
శుభకరుడు సురుచిరుడు… భవహరుడు భగవంతుడెవడూ
కల్యాణ గుణఘనుడు… కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనంద నందనుడు… అమృతరస చందనుడు
రామచంద్రుడు కాకా ఇంకెవ్వడూ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి… ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రసమూర్తి
ఆ మూర్తి శ్రీ రామచంద్రమూర్తి

తాగరా… ఆ ఆ, తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ, శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా, కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా… సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా… ఆనందరామా
మా మా రిమరిమరిసరిమా… రామా జయరామా
సరిమా రామా సపమా రామా… పా ఆఆఆ వన రామా

ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను గల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు… ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
తాగరా ఆఆ ఆఆ… తాగరా శ్రీ రామా నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం.. ..

Allah Sri Rama Song Lyrics In Telugu – శుభకరుడు సురుచిరుడు లిరిక్స్ – Sri Ramadasu – Subhakarudu Surucharudu Lyrics

Like and Share
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading