Menu Close

Abbo Nee Amma Goppade Song Lyrics In Telugu – Anji


అబ్బో నీయమ్మ గొప్పదే… అందం పోగేసి కన్నదే
అబ్బో నీయమ్మ గొప్పదే… అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక… చలి జోరుగున్నది గనక
జతగా శృతిగా… ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడేద్దామా సరిగామపా

ఆమ్మో ఏ రాణి కన్నదో… ఎదలో ఏం మొక్కుకున్నదో
ఆమ్మో ఏ రాణి కన్నదో… ఎదలో ఏం మొక్కుకున్నదో
జగదేకవీర కుమార… వలచాను నిను మనసారా, కనరా కనరా
నా వన్నెచిన్నెలన్ని నీవే… కన్నె చేయి విడువకురా

పూల ఋతువిధే కోమలి… తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో… శ్వాస పరుగులు తీయ్యద
తనువింతై అంతై తెర దించెయ్ దించైమంటే… విడువగ నా తరమ
సొగసింతై అంతై దారికొచ్చెయ్ వచ్చేయ్మంటే… నిలువగ నా తరమ

తమకాలు విడువవు గనుక… తడి చీర బిగిసెను గనుక
చెలియా చెలియా…
ఇక ఉల్లాసంగా ఆడెద్దామా… ఉయ్యాలాట కసి మొలకా

ఆమ్మో ఏం కొంటె పిల్లడో… ఏమా సన్నాయి నొక్కుడో
ఆమ్మో ఏం కొంటె పిల్లడో… ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నాడు గనుక… పస చూడమన్నాడు గనుక
ఒడిలో ఒదిగి, ఇక చుపిస్తాలే… వయ్యారాల ఆటుపోటు తడబడకా

భారమైనది నా ఎద… జారుతున్నది పైయెద
చేరుకున్నదె తుమ్మెద… దోచిపెట్టావే సంపద
ఒళ్ళు తుళ్ళి తుళ్ళి… అరె మల్లి మల్లి, సరసానికి త్వరపెడితే
ఒసి బుల్లి బుచ్చి… నిను గిల్లి గిచ్చి
ఒడి దాడికి ఎగబడితే…
హృదయాలు కలిసెను గనుక… సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా ప్రియుడా…
అరె మల్లి మల్లి సాగించేద్దాం… సందిట్లోన సరిగమపా

అబ్బో నీయమ్మ గొప్పదే… అందం పోగేసి కన్నదే, అబ్బో అబ్బో
అబ్బో నీయమ్మ గొప్పదే… అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక… చలి జోరుగున్నది గనక
జతగా శృతిగా… ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడేద్దామా సరిగామపా

Like and Share
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading