పగటి కలొ, పడుచు వలొ… తననిలాగే తలపులలో
పగటి కలొ, పడుచు వలొ… తననిలాగే తలపులలో
చాలా బాగుంది అనుకుంది… మది లోలో
తానేం చూసింది… అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో… అసలిది ఏమో
తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో… అడిగితె చెపుతుందా
నాపైనే తిరగబడుతున్నదె ఇంకెలా..!
ఆశల వేగాన్నీ ఆపే వీలుందా..?
తెగబడి తడబడి వడివడి… ఇదేమి అలజడో
తగుజతే కనబడి… వెంటాడే ఊహలలో
చాలా బాగుంది… అనుకుంది మది లోలో
తానేం చూసింది… అనుకోని మలుపుల్లో
అపుడెపుడో తగిలినది… మనసుకు నీ తడి
అని ఇపుడిపుడే… గురుతుకు వస్తోంది
తొలకరిలో చినుకు చెలి… చేసిన సందడి
నేలకి తెలిసేలా… చిగురులు వేసింది
చెలిమికి చిగురులు… తొడగగా సరైన సమయము
ఇది కదా అనుకొని… ఎదురేగాలో ఏమో… ఓ ఓ హో
చాలా బాగుంది అనుకుంది… మది లోలో
తానేం చూసింది… అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో… అసలిది ఏమో
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.