Menu Close

Inspiring Telugu Stories – వచ్చిన అవకాశాలను ఆయుధాలుగా మార్చి జీవితంలో గెలుపును సాదించాలి.


Inspiring Telugu Stories

ఒక పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగినా ఒక పని దొరకలేదు. ఆకలి మనిషిని చంపేస్తుంది, అడుక్కోవడానికి మనసు ఒప్పుకోలేదు ఆకలితో అలాగే ఒక చోట పడుకుండి పోయాడు. అది నాటకాలు జరిగే చిన్న థియేటర్స్ అని చెప్పొచ్చు అప్పుడే అక్కడకు అటుగా ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి ఇతడితో నేను లోపలకు వెళ్లి వస్తాను అంత వరకు గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చాక కొంత డబ్బులు ఇస్తాను అన్నాడు.

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

సరే అని తలూపాడు ఈ పిల్లవాడు. నాటకం ముగిసాక బయటకు వచ్చిన వ్యక్తికి ఆశ్చర్యం అతడి గుర్రం మెరుస్తున్నది తన గుర్రమేనా అని అనుకున్నాడు. బాగా శుభ్రం చేసి ఉంచాడు ఈ పిల్లాడు. ఇతడి పనితనానికి మెచ్చిన ఆ వ్యక్తి అనుకున్న దానికంటే ఐదింతలా డబ్బులు ఇచ్చాడు.

మెల్లమెల్లగా నాటకానికి వచ్చిన వాళ్లంతా ఇతడి దగ్గర గుర్రాలను కాపలాకు వదిలి వెళ్లడం ఇతడు వాటిని శుభ్రంగా కడిగి ఇవ్వడంతో ఇతడికి ఇదే వ్యాపారమై ఒక్కో మెట్టూ ఎదిగాడుకొన్ని రోజులకు మరికొంత మందిని పనిలో నియమించి పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు.

ఒకరోజు నాటకం చూడాలనే ఆశతో నాటకం చూడాలని లోపలకు వెళ్లినవాడు. అతడే నాటకాలు రాయడం మొదలు పెట్టాడు అందులోనూ విజయం సాధించి ప్రపంచమే అతడి వైపు తిరిగిచూసేలా రచనలను మొదలు పెట్టాడు. అతడే ఆ పిల్లవాడే షేక్స్ పియర్.

shake spear william Inspiring Telugu Stories

ఇచ్చిన పనిలో నిజాయితీ ఉంటే చాలు దానికి తోడుగా కాస్త పట్టుదల ఉంటే ఎలా బతకాలి ఈ కష్టం ఎలా గట్టెక్కాలి అని బాధపడుతూ కాకుండా వచ్చిన అవకాశాలను ఆయుధాలుగా మార్చి జీవితంలో గెలుపును సాధిస్తారు.

Inspiring Telugu Stories

అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/

Like and Share
+1
1
+1
2
+1
0
Share with your friends & family
Posted in Telugu Stories
Loading poll ...

Subscribe for latest updates

Loading