ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
తల్లి, ఆమె కొడుకు ఒక సరస్సు పక్కకు వెళ్లారు. ఆ పిల్లవాడు ఉత్సాహంగా సరస్సులో ఈదాలని అనుకుని, సరస్సు దగ్గరికి పరిగెత్తి నిర్భయంగా సరస్సులోకి దూకేశాడు. అతన్ని ఆశ్చర్యంగా చూసిన తల్లి, ఆ అబ్బాయి దగ్గరికి ఒక మొసలి రావడం కూడా చూసి భయంతో పరుగుపరుగున సరస్సు దగ్గరికి వెళ్లి వీలైనంత పెద్దగా అరిచి చెప్పింది, “మొసలి తరుముకొస్తోంది. త్వరగా ఒడ్డుకు రా!” అంటూ.
తల్లి అరుపులు విని పిల్లవాడు వీలైనంత వేగంగా ఒడ్డుకు ఈదుకుని వస్తున్నాడు. దగ్గరికి రాగానే తల్లి వాడి చెయ్యి గట్టిగా పట్టుకొని ఒడ్డుకు లాగింది. అదే సమయంలో మొసలి కూడా వాడి కాలు పట్టుకుంది. తల్లి, మొసలి మధ్య పెనుగులాటలో, బలమైన మొసలి ఆ అబ్బాయిని నీళ్లలోకి లాగేస్తోంది.
తల్లి కూడా అంతే బలంగా కొడుకును ఒడ్డుకు లాగుతోంది. ఆ వైపున పోతున్న ఒక రైతు ఈ కేకలు విని తన దగ్గరున్న నాటు తుపాకితో మొసలిని కాల్చి చంపాడు. కొన్ని వారాల వైద్యం తర్వాత బాబు బ్రతికి బయటపడ్డాడు.
ఆ పిల్లవాడిని ఇంటర్వ్యూ చేయడానికి ఒకతను వచ్చి అబ్బాయి కాళ్ళకి ఉన్న ముసలి పళ్ళగాట్ల గాయాల మచ్చలు చూసాడు. పిల్లవాడు అంతే గర్వంగా, “అంతకన్నా బలమైన గాట్లు చేతుల మీద ఉన్నాయ”ని చూపించాడు, “ఇవి ఏమిటి” అడిగాడు.. “మాఅమ్మ నన్ను మొసలిని ఎదిరించి లాగినప్పుడు ఏర్పడ్డవి.”
మన వాలు వాళ్ళు చేసే గాయాలు మన మంచి కోసం.
సేకరణ- V V S Prasad