ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories for Kids
ఆ కొండలు, గుట్టల మధ్య ప్రశాంతంగా ఒక గాడిద గడ్డి మేస్తూ, దాన్ని చంపి తినడానికి వచ్చిన తోడేలును అకస్మాత్తుగా తల ఎత్తి చూసింది. ఏదో ఒకటి ఆలోచించి తప్పించుకోకపోతే తోడేలుకు ఆహారం కాక తప్పదని, గొంతెత్తి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది.
అర్థం కాని తోడేలు, “ఆపు… ఏమిటా ఏడుపు ? ఏం సంగతి?? అంటూ గద్దించింది. “నా కాల్లో ఒక పెద్ద ముల్లు గుచ్చుకొంది. దాన్ని తీయడానికి సహాయం చెయ్యవా ప్లీజ్!!” అని ఏడుస్తూ అడిగింది.
“నిన్ను తినడానికి వచ్చాను. నాకేంటిట!!” “నీ మంచి కోసమే చెప్తున్నాను. ముల్లు చాలా గట్టిగా, పదునుగా, మొనదేలి ఉంది. నీవు నన్నెట్లా ఆయినా తింటావు. అప్పుడు ఆ ముల్లు నీ గొంతులో గుచ్చుకుంటే భయంకరమైన బాధ అనుభవించాలి.
అందుకే నా కాల్లో గుచ్చుకున్న ముల్లు తీసేసి తింటే నీకే బాధా ఉండదు.” తోడేలు కొంచెం ఆలోచించి, సరే అని గాడిద వెనక కాలు దగ్గరకు వెళ్ళింది. గాడిద ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఫెడీల్మని దాని మొహం మీద కాలితో ఒక తన్ను తన్ని, తోడేలు తేరుకునేలోపు పరుగు లంకించుకొంది.
తన తెలివితక్కువతనానికి తనను తాను తిట్టుకుంటూ రాలినపళ్ళకు చింతిస్తూ కూర్చుంది.
క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు, ధైర్యం, సమయస్ఫూర్తి పెంపొందించుకోవాలి. మొదట నీ మెదడు ఉపయోగించకుండా ఇతరుల మాటలు నమ్మొద్దు.
సేకరణ – V V S Prasad