Intelligent Stories in Telugu
ఒక ఇంటర్వ్యూలో అధికారి అభ్యర్థిని “10 సులభమైన ప్రశ్నలు అడగనా, ఒక క్లిష్టమైన ప్రశ్న అడగనా” అనే అవకాశం ఇచ్చాడు. దానికి ఒక్క క్షణం అభ్యర్థి ఆలోచించి “కష్టమైన ప్రశ్న అడగండి సర్” అన్నాడు. “సరే అయితే, పగలు ముందా!, రాత్రి ముందా!” అన్నాడు అధికారి. అభ్యర్థి ఒక్క క్షణం ఆలోచించి
“పగలే సర్” అన్నాడు.
“రాత్రి ఎందుకు కాకూడదు” అధికారి ఎదురు ప్రశ్న వేశాడు. “సర్…… ఒప్పందం ప్రకారం మీరు నన్ను ఒకటే ప్రశ్న అడుగుతాను అన్నారు. రెండో ప్రశ్న అడుగుతున్నారు. నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్” అధికారి అతని సమయస్ఫూర్తికి మెచ్చి అన్నాడు “యు ఆర్ సెలెక్టెడ్”
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి, ఇలాంటి మరిన్ని పోస్టుల కోసం సోషల్ నెట్వర్క్ లో ఫాలో అవ్వండి – @TeluguBucket
Like and Share
+1
+1
+1
+1
+1