ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
ఒక రాజుగారికి శిల్పాలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఉన్న ఎన్నో శిల్పాలలో, మూడు శిల్పాలంటే ఆయనకు మహా ఇష్టం. ప్రాణం. ఒక రోజు ఒక పనివాడు శిల్పాలను శుభ్రం చేస్తుంటే మూడు శిల్పాలలో ఒక శిల్పం అకస్మాత్తుగా పగిలిపోయింది. రాజ గారికి ఈ విషయం తెలిసి పట్టరాని కోపంతో పని వాడిని ఉరి తీయమని ఆజ్ఞాపించాడు.
ఈ విషయం పనివాడికి తెలియగానే మిగిలిన రెండు శిల్పాలనూ పగలగొట్టేసాడు. ఈ సంఘటనకు అందరూ అతని ధైర్యానికి నివ్వెర పోయారు, రాజుగారు
పనివాడిని ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించారు. “మిగిలిన రెండు శిల్పాలను ఎందుకు పగలకొట్టావ్” సేవకుడు, “మహారాజా! ఈ శిల్పాలు బంకమట్టితో చేసినవి, పెళుసుగా ఉంటాయి.
అవేవి అజరామరంగా ఉండేవికావు. ఎప్పుడైనా పగిలిపోవచ్చు. నాలాగే ఇంకెవరైనా ఈ శిల్పాలు పగలగొడితే, వాళ్లు కూడా మరణదండన అనుభవించాలి. మరో ఇద్దరి జీవితాలను రక్షించడానికి పగలగొట్టాను. నాకు ఎలాగూ మరణదండన విధించబడింది.
రాజు తన తప్పు తెలుసుకొని సేవకుడిని శిక్షించకుండా వదిలేశాడు. సేవకుడు రాజు గారికి జీవితం విలువ తెలియజేశాడు. సేవకుడికి మరణ దండన విధించడం న్యాయ విరుద్ధం. న్యాయం చెప్పే వాళ్ళు తప్పుకు తగ్గ శిక్ష విధించాలి, కానీ తన వ్యక్తిగతమైన ఉద్వేగాలకులోనై మరణశిక్షల వంటి కఠినమైన శిక్షలు వేయకూడదు. రాజు కంటే సేవకుడు అన్ని విధాలుగా ఉత్తముడు. చావుబోతూ ఉన్నా మంచితనం ప్రదర్శించాడు. ఉన్నత స్థానంలోని వాళ్ళు న్యాయస్థానాన్ని అవమానించ
కూడదు.
సేకరణ – V V S Prasad