అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Moral Stories in Telugu
బీర్బల్ సమయస్ఫూర్తి ఒక రోజు అక్బర్, బీర్బల్ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే అక్కడ ఉన్న చెరువు చుట్టూ కాకులు ‘కావు కావు’ మంటూ ఆనందంగా ఆడుకుంటున్నాయి. కాకులను చూస్తుంటే అక్బర్ కు ఓ చిలిపి ప్రశ్న మదిలో మెదిలింది.
వెంటనే బీర్బల్ ను అడిగాడు, ” మన రాజ్యం లో ఎన్ని కాకులు ఉంటాయి!!” బీర్బల్ తడుముకోకుండా, “తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు ఉన్నాయి” మహారాజా అన్నాడు. ” అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు. నీవు చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటే???” ప్రశ్నించాడు అక్బర్. ”
అయితే కొన్ని కాకులు పక్క రాజ్యం నుండి మన రాజ్యానికి విహారయాత్రకు వచ్చి ఉంటాయి” ధీమాగా చెప్పారు బీర్బల్ ” నీవు చెప్పిన దాని కంటే తక్కువ ఉంటే”
ప్రశ్నించాడు అక్బర్. ” వాటి బంధువులను చూడ్డానికి పక్క రాజ్యాలకు పోయి ఉండవచ్చు.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Moral Stories in Telugu