ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Best Stories in Telugu, Telugu Short Stories
భక్తుడు ఒక రోజు కాళికాదేవి దర్శనం చేసుకుని గుడి నుండి ఇంటికి పోబోతున్నాడు. దారి చాలా ఇరుకుగా ఉంది. దారికి ఒక వైపున పెద్ద చెరువు, మరో వైపు ఎత్తైన గోడలు. దారి కడ్డంగా అటూఇటూ తిరుగుతూ కోతుల గుంపు అతడిని పోనీయకుండా కాళ్ళకు అడ్డం పడుతున్నాయి.
అడుగు ముందుకు వేస్తే కోతులు అరుస్తూ, కోపంగా చూస్తూ మీదికి వస్తున్నాయి. కాళ్ళ దగ్గరికి వచ్చి భయంకరంగా పళ్ళికిలిస్తున్నాయి. పరిగెత్తాలని చూస్తే వెంట బడుతున్నాయి. వేగం పెంచితే ఒక కోతి వెంటబడి కరవబోయింది.
వాటినుండి తప్పించుకోవడం అసాధ్యం అని అర్థమైంది. దూరం నుండి ఇదంతా చూసి ఒక వృద్ధ సన్యాసి గట్టిగా అరిచాడు, “పారిపోకు… వాటిని ఎదుర్కో !!” అని. ఆ మాటలు అతనిలో కొత్త శక్తిని నింపాయి. పరుగు ఆపి ధైర్యం కూడగట్టుకుని వాటికెదురుగా నిలబడ్డాడు. అంతే!!! కోతులు వెనకడుగు వేసి తోక ముడిచి, ఒక్కొక్కటి జారుకున్నాయి.
సమస్యలకు, ఇబ్బందులకు భయపడి పారిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి
సేకరణ – V V S Prasad