ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఒక అందమైన అమ్మాయి – Telugu Short Stories
ఒక అందమైన అమ్మాయి, ఒక లాయర్ ప్లేన్ లో పక్కపక్కనే కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. లాయర్ ఆ అమ్మాయితో, “చిన్న ఫన్నీ ఆట ఆడుకుందామా!” అని అడిగాడు. అమ్మాయి, కిటికీ పక్కకు ఒరిగి నిద్ర పోదామనుకుంది. లాయర్ జిడ్డులా పట్టుకొని ‘చాలా సులభమైన ఆట’ అంటూ విసిగించసాగాడు.
“నేనొక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్తే ₹ 10/- ఇస్తాను, మీరు చెప్పలేకపోతే నాకు ₹10/- ఇవ్వండి. తరవాత మీరొక ప్రశ్న అడగండి. నేను చెప్పలేకపోతే మీకు ₹10/- ఇస్తాను. చెప్తే మీరు ₹10/- ఇవ్వండి. చాలా సింపుల్.” అంటూ ఇకిలించాడు.
అమ్మాయి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ” సరే! మీరోడిపోతే ₹10/- ఇవ్వండి. నేనోడిపోతే ₹100/ ఇస్తాను.” అని ప్రతిపాదన చేసాడు. అమ్మాయికి నచ్చి, ఒప్పుకుంది. లాయర్ మొదటి ప్రశ్న అడిగాడు, “భూమికి చంద్రుడికి దూరం ఎంత?” అమ్మాయి మాట్లాడకుండా ₹10/తీసి ఇచ్చేసింది. “సరే! ఇప్పుడు మీ వంతు” అన్నాడు లాయర్.
“కొండ పైకి వెళ్ళేప్పుడు మూడు కాళ్ళతోనూ, దిగేప్పుడు నాలుగు కాళ్ళతోనూ వచ్చేది ఏది ??” లాయర్, ప్రశ్నకు అర్థం తెలీక, పిచ్చెత్తిపోయి, జుట్టు పీక్కుని, గూగుల్ తల్లిలో వెదికి, ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, ఈ-మెయిళ్ళు పెట్టి జవాబు దొరక్క, నిద్ర పోతున్న అమ్మాయిని లేపి ₹100/ఇచ్చాడు.
ఆవులిస్తూ అమ్మాయి ₹100/- తీసుకొని, ‘థాంక్స్’ అంటూ కళ్ళు మూసుకుంది. జవాబు తెలుసుకోవాలన్న కుతూహలంతో, అమ్మాయిని లేపి ‘జవాబు ఏమిటి’ అడిగాడు. అమ్మాయి నిద్రకళ్ళతో ₹10/- తీసి ఇచ్చింది.
సేకరణ – V V S Prasad