ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు – అసలేం జరిగింది.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన చంద్రబాబు..ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పటు చేసి మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదు.
రెండున్నరేళ్ల నుంచి అన్నివిధాలా అవమానిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పార్టీని, నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టినా భరించాం. బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. నిన్న కూడా బీఏసీలో సీఎం అవహేళనగా మాట్లాడారు.
ఈరోజు ఏకంకా నా భార్యను కించపరిచేలా దూషించారు. నా భార్య ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. నా వెనుక ఉంటూ నన్ను ప్రోత్సహించింది. కానీ రాజకీయాల్లోకి రాలేదు.
నిండు కౌరవసభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించా. ఈ కౌరవ సభ… గౌరవం లేని సభ. గతంలో వైఎస్ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు.
ఆనాడు వైఎస్ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు: జగన్ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు: ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్ని అవమానిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదన్నారు. క్యారెక్టర్ అసానినేషన్ చేస్తున్నారని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో ఓర్పుగా ఉన్నానన్నారు చంద్రబాబు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని.. ఇంత బాధ భరించలేదన్నారు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానన్నారు.
అధికారంలో తాను ఎవర్నీ కించపరచలేదని.. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగిందని.. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించాను అన్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని.. తర్వాత తప్పు జరిగిందని క్షమాపణ కోరారన్నారు. ప్రజా క్షేత్రంలోనే పోరాడతానని.. తన ధర్మ పోరాటానికి ప్రజలు సహకరించాలన్నారు.