Menu Close

దేహమే దేవాలయం – తప్పకుండా చదవండి – Interesting Facts in Telugu

మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని, వారూ వెళుతున్నారు అనీ దేవాలయాలకు వెళుతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు ఆలయంకి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకొని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు అతని దర్శనం.

human body as temple

దేవాలయం ఒక దేహం నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవ శరీరమే. ఇక్కడ ‘తత్’ (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.

human body as temple

భగవంతుడు లేకుండా మానవుడు లేడు.. మానవుడు జీవించలేడనీ, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్షియస్ బాడీ) ప్రతిబింబిoచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

human body as temple

దేహమే దేవాలయం:-
శరీరం ‘శీర్యతే ఇతి శరీరః!!’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం – శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనంలో కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.

దేహం:-
దేహమని ఎందుకన్నారు ? ‘దహ్యతే ఇతి దేహః’ అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా ? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా ! అవి దహింపబడవు గదా ! మరి వాటిని దేహాలు అని అనరా ? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలనే అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం.

దేవాలయం:-
దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకు అంటే “దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః” – అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం, ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి – ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు ‘స్వయంభూ’ అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది ? ఏ దేవుని పూజ గొప్పది ? ఆలోచించుకోవాలి.

దేహమే దేవాలయం:-
‘దేహమే దేవాలయం’ అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు, శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు.

హృదయమే దేవుని దేవాలయం:-
మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవ దేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వారా మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను చేసుకొని తరించాలి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న విగ్రహ రూపములోని దైవాన్ని దర్శించడం అంటే మనం మన హృదయాoతరంలో వున్న ఆ సర్వేశ్వరున్ని ధ్యానం ద్వారా పరిపూర్ణ (సంపూర్ణ) దర్శనం చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన ఋషులు ఆలోచించి అలా చేయవలసి వచ్చింది.

ఇందులో మనిషి ఎంతో తెలుసుకోవలసిన భగవంతుని దైవత్వ సత్య అన్వేషణ జ్ఞానం ఉన్నది. ఆలోచిస్తేనే ఎంతో అర్ధం చేసుకోగలం, సాధనతో సాధ్యం చేసుకోగలము.

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

భగవంతుని జ్యోతి స్వరూపులు అయిన మానవుల దేహమే దేవాలయంగా ఉన్నది. ఈ సమస్త విశ్వ భూమండల సృష్టిలోని మహాద్భుత చిదంబర దేవాలయ రహస్యం ఇదియే.

మనిషి జీవాత్మ దేహామే దేవాలయము ముక్తి మోక్ష మార్గ మహాజ్ఞాన సందేశం. మనిషి దేహమే దేవాలయం { చిదంబర ఆలయం}పంచభూతాల తత్త్వంతో నిర్మితమైన మహా అద్భుత మనిషి దేహా సృష్టి రహస్యం.

మనవుల దేహమే దేవాలయం (గుడి ) మనిషి లోపల కొలువైవున్న “జీవుడు (దేవుడు) + ఆత్మ (పరమాత్మ) “జీవాత్మ” ను దర్శించి తనే పరబ్రహ్మమనే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత శరీర గమ్యం ఇదే మోక్షం.

దేవాలయము చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండదు. మీ దేహములోని పరమాత్మని అన్వేషించి దేహం లోపలికి అంతర్ముఖంగా ప్రయాణిస్తే ఫలితం అమోఘామృతం లభిస్తుంది.

ప్రస్తుతం ఎంత మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. మనవ దేహం లోపల జీవుడే దేవుడిగా, ఆత్మయే పరబ్రహ్మ జ్యోతి దర్శనంగా చేసుకుంటున్నారు.

మనవ దేహం లోపల వచ్చి వెళ్లే శ్వాసయే పరమాత్మ పరబ్రహ్మ జ్యోతి స్వరూపంగా ఉన్నది.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading