ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
11-10-2021
ఇప్పటి వరకు ఐపిఎల్ 2021 మ్యాచ్ లు అంతా ఆసక్తి కరంగా లేవనే చెప్పాలి, గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి, కాగా ఇప్పుడు లీగ్ లో చివరి దశకి చేరుకున్నాం, ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ లు అయిన కొంచెం ఆసక్తి కలిగిస్తాయని కోరుకుందాం.. నిన్నటి చెన్నై మరియు డిల్లీ టీమ్స్ మద్య జరిగిన మ్యాచ్ కొంచెం రసవత్తరంగా జరిగిందనే చెప్పాలి.. చివరిలో ధోని మెరుపులు రాణి ఉరుములు లాంటి షాట్స్ తో చెన్నై ని గెలిపించాడు, ఇక ఈ రోజు మ్యాచ్ గురుంచి చూద్దాం..
ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కి సోమవారం షార్జా ఆతిథ్యమివ్వబోతోంది. సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బుధవారం షార్జా వేదికగానే ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఆడనుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 28 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. మిగిలిన 13 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. ఇక చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌లకిగానూ మూడింట్లో బెంగళూరు గెలుపొందగా.. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి.
ప్లేఆఫ్స్ అనుభవంపరంగా చూసుకున్నా బెంగళూరు కంటే కోల్‌కతా ముందజలో ఉంది. ఇప్పటికే కోల్‌కతా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా.. బెంగళూరు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. అయితే.. కెప్టెన్‌గా తనకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో.. బెంగళూరు టీమ్ గట్టిగా పోరాడే అవకాశం ఉంది. టీమ్ బలాబలాల్ని పరిశీలించినా.. కోల్‌కతా కంటే బెంగళూరు టీమ్ మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతికి కేఎస్ భరత్ సిక్స్ కొట్టడంతో గెలిచిన బెంగళూరు ఇప్పుడు మంచి జోష్ మీద కనిపిస్తోంది.
ఈరోజు గెలిచిన టీమ్ నిన్న ఓడిన డిల్లీ టీమ్ తో మ్యాచ్ ఆడనుంది, ఓడిన టీమ్ ఇంటిదారి పట్టనుంది.