Menu Close

నేను నా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకున్నానో చూడండి – Hair fall solution in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నేను నా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకున్నానో చూడండి – Hair fall solution in Telugu

ఎన్ని చేసినా జుట్టు రాలుతూనే ఉందా..?
ఈ చిన్న టిప్ పాటించి చూడండి.

ముందుగా నేను నా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకున్నానో చెప్తా: Hair fall solution in Telugu

సాధారణంగా ఒక్క రోజుకి 50 నుండి 100 వెంట్రుకులు రాలిపోవడం సహజం, అంతకన్నా ఎక్కువ రాలిపోవడాన్ని మనం సమస్య గా పరిగణించాలి, నేను తలస్నానం చేసినప్పుడు నా చేతి వెల్ల లోకి కుప్పలు కుప్పలుగా వెంట్రుకలు వచ్చేయి.. అది కాకుండా ఇంటి నిండా నా వెంట్రుకలే కనిపిస్తూ వుండేవి , అంటే నా సమస్య ఎంత పెద్దధో ఆలోచించండి..

నా జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం, వేడి..తినే ఆహారపు అలవాట్ల వల్ల కానీ, వుండే ప్రదేశాల వల్ల కాని మనలో వేడి పెర్గి పోతుంది. ఆ వేడి అనేది ఒకొక్కరిలో ఒక్కోలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చర్మం పై పింపుల్స్ రావడం, ఆరి కాళ్ళు మండటం, కళ్ళు మండటం, ఇక ముఖ్యమైనది జుట్టు రాలడం.

మనలో వేడి తలను చేరి ఆ ఎఫెక్ట్ మన జుట్టు మీద పడుతుంది. అందువల్ల మన జుట్టు బాగా రాలుతుంది. ఇక నాకు బాగా పని చేసిన చేసిన చిట్కాను మీకు చెప్తా..

How to Control Hair Fall in Men and Women

మీకు జుట్టు ఎక్కువ రాలుతున్నటైతే మీ జూటును ఎంత చిన్నగా కుదిరితే అంతా చిన్నగా కత్తిరించుకోండి. ఆముదం జుట్టు మొదళ్ళకు బాగా పట్టేటట్టుగా రాసుకుని ఒక గంట రెండు గంటలు తరవాత తల స్నానం చెయ్యండి. వీలైతే ఒక రాత్రి పూట అంతా వుంచుకుని ఉదయాన్నే తల స్నానం చెయ్యండి.

కొన్ని కొన్ని రకాల మిశ్రమాలు కొంత మందికి మాత్రమే పని చేస్తాయి, చాలా మంది చాలా రకాల మిశ్రమాలను కలిపి మీ జుట్టుకి రాయండి కచ్చితంగా పని చేస్తుంది అంటారు..ఎందుకంటే వారి జుట్టు కి ఆ మిశ్రమం బాగా పని చేసి వుంటుంది. అందుకని ఈ లిస్ట్ లో మీరు ప్రయత్నించని వాటి ప్రయత్నించి చూడండి.

ఇక ఈ కెమికల్ షాంపూలు, ఆయిల్స్ వంటివాటిని వాడడం కన్నా స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడడం ఎంతో మేలు.

Oils For Hair Fall

  • కొబ్బరినూనె తో పాటు కొంత ఉల్లిపాయ రసాన్ని కలిపి జుట్టు మొదళ్ళలో మర్దనా చేయండి. ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
  • అలాగే ఉసిరి పొడి-ఆలివ్ ఆయిల్, కర్పూరం-కొబ్బరి నూనె మిశ్రమాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
  • చుండ్రు ఎక్కువ వున్న వాళ్ళు మెంతులు ని నానా బెట్టి పిండి చేసుకుని కొంచెం కొబ్బరి నూనె కలిపి పట్టించుకుంటే మంచి ప్రయోజనం వుంటుంది.
  • అలానే బృంగ్ రాజ తైలం పేరు వినే వుంటారు, ఎక్కువ శాతం వాళ్ళకి ఇది బాగా ఎఫెక్ట్ చూపించింది అని చెప్తున్నారు, ఇది కూడా ఒక్కసారి ప్రయత్నించండి.
  • ఇంకా కొబ్బరి నూనె మరియు కొంచెం ఆముదం కలిపి వాడిన మంచి ప్రయోజనం వుంటుంది. మీకు జుట్టు ఎక్కువ రాలుతున్నటైతే మీ జూటును ఎంత చిన్నగా కుదిరితే అంతా చిన్నగా కత్తిరించుకోండి. ఆముదం జుట్టు మొదళ్ళకు బాగా పట్టేటట్టుగా రాసుకుని ఒక గంట రెండు గంటలు తరవాత తల స్నానం చెయ్యండి. వీలైతే ఒక రాత్రి పూట అంతా వుంచుకుని ఉదయాన్నే తల స్నానం చెయ్యండి.

నచ్చితే తప్పకుండా మీ సోషల్ మీడియాలో షేర్ చెయ్యండి, మీ WhatsApp స్టేటస్ గా కూడా పెట్టండి, కొంత మందికైనా దీని వల్ల ఉపయోగం కలిగిన మంచిదే..

Jutttu Raladaniki Karanaalu,
Juttu Raalakunda vundataaniki Oils.

Hair fall control home remedies in Telugu
Natural ways to get long hair in Telugu
Ayurveda for preventing hair fall in Telugu
Oils to reduce hair loss in Telugu
Causes and solutions for hair fall in men in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading