అహంకారం మన అభివృద్ధికి అడ్డుగోడ – Ego is the Enemy – Book Recommendations
పుస్తకం పేరు: Ego is the Enemy
రచయిత: రైయన్ హాలిడే (Ryan Holiday)
ప్రచురణ సంవత్సరం: 2016
సెల్ఫ్ హెల్ప్, ఫిలాసఫీ, పర్సనల్ డెవలప్మెంట్ వంటి విషియాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం మనం జీవితంలో ఎదురయ్యే మూడు దశల్లో అహంకారం మన పురోగతికి ఎలా అడ్డుపడుతుందో వివరంగా చెబుతుంది.
- Aspiring Stage (కోరికల దశ)
- Success Stage (విజయం దశ)
- Failure Stage (ఓటమి దశ)
ఈ మూడు దశల్లో మనం ఎలాంటి మార్గం తీసుకోవాలో, అహంకారాన్ని ఎలా కంట్రోల్ చేయాలో రైయన్ హాలిడే స్పష్టంగా చెప్పాడు.
Important points from the the book “Ego is the Enemy”
1. అహంకారం మనకి స్నేహితుడు కాదు, అది మనకు శత్రువు.
2. అహంకారం మన అభివృద్ధికి అడ్డుగోడలా నిలుస్తుంది.
3. విజయం వచ్చినప్పుడు మనకు అహం రావడం సహజం – కానీ దాన్ని అణచేయడం మన బలం.
4. “నేను” అనే భావనను వదిలిపెట్టి “మనం” అనే దృక్పథాన్ని అవలంబించాలి.
5. ఆత్మవిశ్వాసం అవసరం, కానీ అది అహంకారంగా మారకూడదు.
6. ఒక మంచి నాయకుడు ఎప్పుడూ వింటాడు, చెప్పడం కాదు.
7. ప్రతి ఒక్క విజయానికి మీరే క్రెడిట్ తీసుకోవడం కాకుండా, మీ టీమ్ ని అభినందించాలి.
8. అహంకారం ఉన్నవారు అవకాశాలను కోల్పోతారు – ఎందుకంటే వారు నేర్చుకోవడం ఆపేస్తారు.
9. ప్రతిభ ఉన్నవారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువుగా పని చేస్తారు. “మాటలు తక్కువ చేతలు ఎక్కువ”
10. విజయం వచ్చినప్పుడు కూడా ఒదిగి ఉండటం నిజమైన విజయం.
11. అహంకారంతో బతకడం అర్థం లేకుండా మారుతుంది – అది మనల్ని ఒంటరిగా మారుస్తుంది.
12. చిన్న చిన్న ప్రశంసల/పొగడ్తల కోసం నిజమైన గమ్యం వదిలిపెట్టకూడదు.
13. నిజమైన విజయం అంటే మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎదగడం.
14. మనకు తెలియని విషయాలను అంగీకరించడం గొప్ప లక్షణం.
15. ఒక మంచి జీవితానికి అవసరమైనది వినయమే – అహంకారం కాదు.
ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా…
ఎదగాలని అనుకునే యువతకు,
ఇప్పటికే విజయాన్ని చవిచూసినవారికి,
జీవితంలో నిరాశతో ఉన్నవారికి,
ఈ పుస్తకం ఓ మార్గదర్శకంగా నిలుస్తుంది. మనలోని “అహం” అనే శత్రువును మనమే గెలవాలి.
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది
తప్పకుండా చదవండి👇
Ego is the Enemy
పట్టుదల ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు – Grit – Book Recommendations