Menu Close

విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు – Can’t Hurt Me – Book Recommendations


విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు – Can’t Hurt Me – Book Recommendations

పుస్తకం పేరు: Can’t Hurt Me: Master Your Mind and Defy the Odds
రచయిత: డేవిడ్ గాగిన్స్ (David Goggins)
ప్రచురణ సంవత్సరం: 2018
ఆటోబయోగ్రఫీ, సెల్ఫ్-హెల్ప్, మైండ్‌సెట్, మోటివేషన్ వంటి విషియాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మలిచిన అత్యంత శక్తివంతమైన పుస్తకాలలో ఇది ఒకటి.

విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు - Can’t Hurt Me - Book Recommendations

డేవిడ్ గాగిన్స్ – చిన్నతనంలో తీవ్రమైన హింస, పేదరికం, వివక్ష, మరియు ఒత్తిడితో ఎదిగిన ఒక సాధారణ అబ్బాయి. కానీ, అతను ఒక అద్భుతమైన మార్పుకు మూలస్తంభం అయ్యాడు. అతను అమెరికన్ నేవీ సీల్, ఆర్మీ రేంజర్, అల్ట్రామ్యారతాన్ రన్నర్, మరియు బలమైన మానసిక బలం కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. ఈ మార్పు మొత్తం సాధించడానికి అతను ఎలా మానసిక క్రమశిక్షణను అభివృద్ధి చేశుకున్నాడు, తన బాధలను, భయాలను ఎలా ఛేదించాడు అన్నదే ఈ పుస్తకం కథనం.

Important points from the the book “Can’t Hurt Me

1. మన బాధలపై మనం మానసికంగా గెలవడం నేర్చుకుంటే, ఈ లోకం మనల్ని గాయపరచలేదు.
2. జీవితంలోని “కష్టాలు” పరీక్షలాంటివి. వాటిని ఎదుర్కొనే ధైర్యమే నిజమైన విజయం.
3. బాధతోనే మనం బలంగా మారతాం.
4. నువ్వు ఆగిపోయిన చోటే నీ శక్తి ప్రారంభమవుతుంది.
5. నిన్నటి నిన్ను ఈ రోజు నువ్వు ఓడించగలిగితే – నువ్వే నీ హీరో.

6. మనలో ఉన్న చీకటి కోణాన్ని అంగీకరించగలగడం వల్లే నిజమైన మార్పు వస్తుంది.
7. అవుట్‌సైడ్ ప్రపంచం మనల్ని తక్కువ అంచనా వేస్తుంది – కానీ మనం మన నిజమైన శక్తిని అంచనా వేయకపోతే, ఎప్పటికీ ఎదగలేం.
8. పెయిన్ ని ప్రేమించాలి – ఎందుకంటే అదే మనకు గెలుపు చూపిస్తుంది.
9. ప్రతి రోజు అద్దంలోకి చూసుకుని, నిజాయితీగా తన్ని అడుగు – “నీవు నిజంగా నిన్ను నీవు గౌరవించేలా జీవిస్తున్నావా?”(Accountability Mirror).
10. అనుభవం లేకపోయినా, ప్రయత్నిస్తే గెలవలేకపోవచ్చు కానీ ప్రయత్నించకపోతే ఓటమి మాత్రం ఖాయం.

11. విజయం అంటే లక్ష్యాన్ని చేరుకోవడం కాదు – ఆ లక్ష్యానికి వెళ్లే మార్గంలో మన క్రమశిక్షణ, త్యాగం, కృషి.
12. పొరపాట్ల వల్ల మనం క్రిందపడితే, మళ్లీ లేచే ప్రయత్నమే నిజమైన బలం.
13. తొలిప్రయత్నంలోనే గెలవాలన్న ఆలోచన వదిలేయాలి. కొన్ని విజయాలు ఓడాకే వస్తాయి.
14. వెరీ హార్డ్ గా ట్రైన్ అవ్వాలి, మనల్ని అందరూ చూస్తున్న సమయంలోనే కాదు – మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా.
15. ప్రతిరోజూ నీ మానసుని చిన్నచిన్న పోరాటాలతో స్ట్రాంగ్ చేసుకోవాలి.

16. కష్టకాలంలోనే మన నిజమైన శక్తి బయట పడుతుంది – కంఫర్ట్ జోన్ మనకి శత్రువు.
17. విజయం తలకెక్కకూడదు – అది కూడా ఓ తాత్కాలిక ఫలితం మాత్రమే. దీని వల్ల అహంకారానికి అవకాశం ఇవ్వొద్దు.
18. ఇతరులు కాదు నీకు నీవే మోటివేషన్‌గా మారాలి.
19. ఒకసారి కాదు, జీవితాంతం ప్రతీరోజూ నువ్వు గెలవడానికి ప్రయత్నించాలి. అదే జీవించడమంటే!

“Can’t Hurt Me” పుస్తకం కేవలం “ఒక సాధారణ వ్యక్తి అల్ట్రామ్యాన్ గా ఎలా మారాడో చెప్పే కథ మాత్రమే కాదు”. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని, బలహీనతను ఎదుర్కొని, నిజమైన శక్తిని బయటకు తేవడానికే ఒక బలమైన ఆయుధం.

తప్పకుండా ప్రతి ఒక్కరూ
చదవాల్సిన పుస్తకం ఇది👇
https://amzn.to/4k1IAzF

ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోకు – The Courage to Be Disliked – Book Recommendations

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

2 Comments

  1. Sambasivarao diyya

    విజయం అంటే కేవలం లక్ష్యం చేరుకోటం కాదు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading