Menu Close

లైలా మూవీ రివ్యూ – Laila Movie Review – విశ్వక్ సేన్ – 2025


లైలా మూవీ రివ్యూ – Laila Movie Review – విశ్వక్ సేన్ – 2025

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘లైలా’ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) కానుకగా ఈ రోజు విడుదల చేశారు. వివాదాలు పక్కన పెడితే సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే..

లైలా మూవీ రివ్యూ - Laila Movie Review - విశ్వక్ సేన్ - 2025

సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు. లైలా సినిమా ఎలా ఉంది? విశ్వ‌క్ ఎలా చేశాడు? అమ్మాయిలా ఎలా న‌టించాడు అన్న విష‌యాల‌ను ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు.

నాకైతే పర్సనల్ గా ఈ సినిమా నచ్చింది, నేను మరీ థియేటర్ నుండి బయటకి వచ్చేదం అనేంతలా అయితే లేదు. ఒకసారి చూడవచ్చు. నా ఒక్కడి ఒపీనియన్ పక్కన పెడితే మిగతా వాళ్ళు ఏం అనుకుంటున్నారో కూడా ఒక్కసారి చూసేద్దాం..

విశ్వక్ సేన్ లేడీ గెట‌ప్‌లో అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. త‌న క్యారెక్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయ‌ని చెబుతున్నారు. కానీ ఇలాంటి రొటీన్ స్క్రిప్ట్‌లను దయచేసి ఎంచుకోకు.. చాలా డిజప్పాయింట్ అయ్యాం.. వరెస్ట్ సినిమా.. అంటూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు. ఇందులో చాలా మంది కావాలనే ఇలా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ కొంత మంది మాత్రం పర్వాలేదు, ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెబుతున్నారు.

బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తోనే గట్టెక్కుద్దామని అనుకుంటే చాలా కష్టమని, లైలా నిలబడటం కష్టమని ట్వీట్లు చేస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ మధ్య ఫాం కోల్పోయిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న విశ్వక్ అయితే కనిపించడం లేదు. ఫలక్ నుమా దాస్, ఈనగరానికి ఏమైంది టైంలో విశ్వక్ ఏదో సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తరువాత తరువాత రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించే క్రమంలో రొటీన్ స్టోరీలకు అలవాటు పడ్డాడు. మధ్యలో అశోకవనంలో, గామి అంటూ మంచి ప్రయోగాలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి పేరుని సంపాదించుకున్నాడు.

సోను మోడల్ లాంటి చెత్త కారెక్టర్ ఇంత వరకు ఎక్కడా చూసి ఉండరు.. అదే ఈ సినిమాను ముంచేసిందని ట్విట్టర్‌లో టాక్ నడుస్తోంది. ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిన కథ, కథనం, ఒక్క చోట కూడా నవ్వు తెప్పించలేకపోయాడని, అర్థంపర్థం లేని సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వృథా చేశారని అంటున్నారు. చూస్తుంటే లైలా మీద చాలా మంది నిరాసక్తతో ఉన్నారనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలకు కంటెంట్ మాట్లాడాలి.. వివాదాలతో సినిమాను గట్టెక్కించుకోవాలనుకుంటే ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లైలా మూవీ రివ్యూ – Laila Movie Review – విశ్వక్ సేన్ – 2025

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Movie Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading