అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మహా కుంభమేళా నిర్వహించడానికి సుమారు ₹7500 కోట్లు ఖర్చు – Maha Kumbh Mela Facts
Maha Kumbh Mela Facts: మహాకుంభమేళా నిర్వహించడానికి అంటే తాత్కాలిక టెంట్ సిటీ నిర్మించడానికి, రోడ్లు వేయడానికి, శానిటేషన్, భద్రత, ఇతర సదుపాయాలు మొదలగు వాటిపై ఖర్చు చేయడానికి సుమారు ₹7500కోట్లు ఖర్చు అవుతుంది అని అంచనా. దీన్లో ₹5,400 కోట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంటే ₹2,100 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెడుతోంది.
అబ్బా… ఈ మత తంతు కు ఇన్ని వేలకోట్ల ప్రజాధనం తగలెయ్యాలా? ఆ డబ్బులతో హాయిగా ఆసుపత్రులు కట్టవచ్చు, యూనివర్సిటీ లు, విద్యాలయాలు కట్టవచ్చు. దేశం అభివృద్ధి చెందడం లేదు అంటే ఇదిగో ఇటువంటి బుర్రలేని ఖర్చులు పెట్టడం వల్లే అని మేధావులు తొందరపడి కామెంట్స్ చేయకండి.
ఈ కుంభమేళా వల్ల సుమారు 2 నుండి 4 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. కనీసం రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది అని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ చెపుతోంది.
ఈ “అల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్” అంచనా ప్రకారం 40-45 కోట్ల మంది ఈ మేళా కు వస్తారని, ఒక్కొక్కరు కనీసం ₹5000 ఖర్చు చేస్తే అది అతి సులువుగా ₹2 లక్షల కోట్ల వ్యాపారం కి దారి తీస్తుంది అని చెపుతున్నారు. దీనిలో ఒక్క హోటల్ పరిశ్రమ కు ₹50,000 కోట్ల ఆదాయం వస్తుంది, ఆహారపదార్థాలు, పానీయాలు మరో ₹20,000 కోట్లు అలాగే పూజా సామగ్రి ₹20,000 కోట్లు అమ్మకాలు జరుగుతాయని చిన్న వ్యాపారులు సంఘం అంచనా వేస్తోంది. ఒక్క యుపి ప్రభుత్వానికి సుమారు ₹30,000 కోట్ల ఆదాయం వస్తుంది అని అంచనా.
ముంబై లో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఆర్ధిక వేత్త, యుపి డెవలప్మెంట్ ఫోరం ఛైర్మన్ అయిన పంకజ్ గాంధీ జైస్వాల్ గారి ప్రకారం..
“భారత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాంస్కృతిక మరియు పండుగ ఉత్సవాలతో ముడిపడి ఉంది. ప్రాంతీయంగా జరిగే జాతరులు, పండుగలు, ఉత్సవాలు, సంతలు, అలాగే జాతీయ స్థాయిలో జరిగే పుష్కరాలు, కుంభమేళా లు భారత ఆర్థిక వ్యవస్థ కు ఎప్పటికప్పుడు చైతన్యం తీసుకువస్తాయి, అందుకే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు లో తరుచుగా ఊహించే ఆర్థిక మాంద్యం లక్షణాల సైకిల్స్ భారత ఆర్థిక వ్యవస్థ లో రావు అని చెప్పారు”
“2019 కుంభమేళాకు సుమారు 24 కోట్ల మంది వచ్చారు. ఒక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే ₹1,20,000 కోట్లు జత కూడింది. ఇది 2013 కుంభమేళా సంఖ్య తో పోలిస్తే రెట్టింపు అయింది. అందుకని ఈ సారి 40 కోట్ల యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నాం, మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుంటే నా అంచనా ప్రకారం ప్రతీ యాత్రికుడు సరాసరి ₹10,000 ఖర్చు చేస్తారు. అందువల్ల ₹4 లక్షల కోట్లు దేశ ఆర్ధిక వ్యవస్థలోకి వస్తాయి. ఇది సుమారు 1%జిడిపి వరకు వుంటుంది” అని జైస్వాల్ చెపుతున్నారు.
ఇది ఇలా ఉండగా దేశ విదేశ విద్యా సంస్థలు, ఇతరులు ‘కుంభ మేళా’పై రీసెర్చ్ చేయడానికి తమ టీమ్స్ ని పంపాయి. వీటిల్లో ముఖ్యమైనవి హార్వార్డ్, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలు, గేట్స్ ఫౌండేషన్, AIIMS, IIM s, IIT లు, JNU, జాతీయ పోలీసు అకాడమీ మొదలైనవి ఉన్నాయి.
ఇన్ని కోట్ల మంది యాత్రికులను ఎలా మెనేజ్ చేస్తున్నారు? భద్రతా విషయాలు, సాంఘిక, సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రభావం, టూరిజం, హోటల్ వ్యాపారాలపై ప్రభావం, టెక్నాలజీ ఎలా ఉపయోగించ వచ్చు వంటి పలు విషయాలు పై ఈ టీమ్స్ రీసెర్చ్ చేస్తున్నాయి. వీరు యుపి ప్రభుత్వానికి రిపోర్టు కాపీలు ఇస్తారు. భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ రిపోర్ట్స్ ఉపయోగపడతాయి అని యుపి ప్రభుత్వం ఆశిస్తోంది.
కుంభమేళా గురించి వివరంగా తెలుసుకోండి – Kumbha Mela Explained in Telugu