నజ్రియా సూక్ష్మదర్శిని రివ్యూ – క్రైమ్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ – Sookshmadarshini Movie Review
Sookshmadarshini Movie Review: మన చుట్టూ మనకు తెలియకుండా ఎన్నో సీక్రెట్ లో ఉంటాయి. అలాంటి ఓ రహస్యాన్ని హాస్యంతో కలిపి ఓ పొరిగింటి అమ్మాయి బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. చిన్న కథ, చిన్న సస్పెన్స్ కానీ స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని టూల్స్ వాడాలో అన్ని వాడి టైట్ గా రూపొందించారు.

టైట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఎంత బాగా థ్రిల్ చేయవచ్చో ఈ సినిమా ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. సినిమా ప్రారంభమైన పది నిముషాల్లోపై పూర్తిగా కథలోకి వెళ్లిపోయారు. అలాగే మనం సినిమా మొదటి నుంచి చివరి దాకా అసలు తెరపై ఏం క్రైమ్ జరుగుతోంది. క్రిమినల్ ఎవరు, పట్టుబడతాడా అనే యాంగిల్ లోనే ఆలోచిస్తూంటాం. అలా మనం లీనమై చూడటమే డైరక్టర్ ఎక్సపెక్ట్ చేసింది కూడా కావచ్చు.
అలాగే ఈ సినిమాలో జరిగే ఇన్విస్టిగేషన్ ఎప్పుడూ ఏదో జరుగుతోంది అన్నట్లుగానే నడుస్తుంది తప్పించి, ఎవరు చేస్తున్నారు అనేది మనకు ఆలోచించే అవకాసం ఇవ్వదు. మొదటి నుంచి చివరిదాకా మాన్యువల్ పాత్ర చాలా బ్యాడ్ ఇంటెన్ష్ తో ఉన్నట్లు , ఏదో దాస్తున్నట్లు హింట్ ఇస్తూండటంతో మన దృష్టి వేరే వైపుకు వెళ్లదు. అతను ఏం దాస్తున్నాడు…అన్నదే ముఖ్యాంశం. ఆ సీన్స్ బాగా పండాయి. తక్కువ ఖర్చు హై స్టాండర్డ్స్ తో స్టోరీ టెల్లింగ్ ఎలా చేయవచ్చు అనేది ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు.

సూక్ష్మదర్శిని ఓ విభిన్న తరహా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ . ఫన్ తో కలిసిన థ్రిల్లింగ్ సినిమాకు వెన్నుముకలా నిలుస్తుంది. క్రైమ్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. డిస్నీ ‘హాట్ స్టార్’లో తెలుగులో ఉందీ చిత్రం.