ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇదేగా నిజమైన ప్రేమంటే – Beautiful Love Story in Telugu
అందమైన జంట, అప్సరసలా వుండే భార్య, కంటికి రెప్పలా చూసుకునే భర్త, ఎంతో ఆనందమైన జీవితం, దేవుడికే కళ్ళు కుట్టాయోమో వారి అన్నోన్య జీవితం చూసి..
ఆమెకు చర్మ రోగం వచ్చి… అందమంతా రాలిపోయింది. అది తలుచుకుని ఎంతగానో కుమిలి పోయింది, తన భర్తను తను ఎక్కడ పొగుట్టుకుంటుందో అని కృంగి పోయింది. తన అందాన్నే చూసిన భర్త… ఇప్పుడు తన వికార రూపాన్ని చూసి ఎక్కడ ఆసహ్యించుకొంటాడని బయపడిపోయింది.
ఒక వారంలోనే భర్త వ్యాపార రీత్యా బయటి పట్టణాలకు పోవలసి వచ్చింది… పదిహేను రోజులు తరువాత వచ్చాడు గుడ్డివాడుగా… ఆక్సిడెంట్ అయ్యి రెండు కళ్ళు పోయాయి. కొన్నాళ్ళు గడిచాయి… ఆమె మరణించింది… భర్త కర్మ కాండలు పూర్తి చేశాడు. ఆ జ్ఞాపకాలను మరచిపోలేక ఊరు వదిలి వెళ్ళి పోతున్నాడు. పక్కింటి ఆయన అడిగాడు, భార్య లేదు. కంటి చూపు కూడా లేదు. వేరే ఊరికి వెళ్ళి ఎలా బ్రతుకుతావన.?
నా భార్య చర్మ రోగం వచ్చినప్పటి నుంచి అందవిహీనమై, నా ప్రేమకు నోచుకొనేమోనని కృంగిపోతూ ఉండేది. నేనది గమనించి ఇన్నాళ్ళూ కంటిచూపు లేనివాడిగా నటించా.. ఆమె సహజ ప్రేమ అన్యోన్యతలను అనుభవించా… ఆమె లేని ఆ మధుర జ్ఞాపకాలతో ఇక్కడే బ్రతికలేక వెళుతున్నా… అన్నాడు.
అది విన్న పక్కింటి అతను
ఇదేగా నిజమైన ప్రేమంటే…
భార్య సంతోషం కోసం ఇంతటి త్యాగం చెసాడు అని మనసులో అనుకున్నాడు.
నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
ఈ కథలో ఆనందం యొక్క నిజమైన రహస్యం ఉంది.