Menu Close

నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా – Life Lessons in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

నిజమైన సంతుప్తి ఎక్కడ దొరుకుతుందో తెలుసా – Life Lessons in Telugu

నేను, నా స్నేహితుడు అశోక్ 1980లలో IITలో చేరాం. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జాయిన్ అయ్యాము. చదువు ఐపోయాక అశోక్ ఆపిల్ కంపెనీలో చేరాడు, నేను ఒక పెద్ద కన్సల్టెన్సీ ఫర్మ్‌లో చేరాను.

old man happy

అనుకోకుండా ఒకనాడు నేను కోల్‌కతాకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్తున్న దారిలో కారు సడన్ గా ఆగిపోయింది. గ్యారేజీకి తీసుకెళ్లాను. గ్యారేజీలో నా కారు మరమ్మత్తు చేస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాను. అతను మరెవరో కాదు, నా స్నేహితుడు అశోక్.

అప్పుడు నేను అతనిని అడిగాను, “అశోక్, నువ్వు నా జీవితంలో కలిసిన అత్యంత తెలివైన వ్యక్తివి. నేను నిన్ను ఇప్పటికీ ఏదో ఓ పెద్ద కంపెనీకి CEOగా వుంటావాని ఊహించాను. నువ్వు ఇక్కడ కార్లు గ్యారేజీలో పని చేస్తూ ఉండటానికి కారణమేంటి?

అశోక్ నవ్వుతూ చెప్పాడు, “నీకు తెలుసుగా? నేను కొన్నేళ్ళు ఆపిల్‌లో పని చేశాను. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాను. ఆ తరవాత ఒక కంపెనీ మొదలుపెట్టాను, అది ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచింది. ఆ కంపెనీని అమ్మేశాను. ఆ తర్వాత ఈ గ్యారేజీ ప్రారంభించాను. ఎందుకంటే నాకు నిజంగా ఇష్టమైంది నా చేతులతో కార్లు మరమ్మత్తు చేయడమే.”

దీన్ని విన్న కుమార్ ఆలోచనలో పడ్డాడు. ఒక్కసారిగా అతని జీవితం అంతా కన్నుల ముందు మెదిలింది. “ఇప్పుడు అతనికి 65 సంవత్సరాలు. ఓ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. కానీ జీవితంలో ఎప్పుడు అతనికి నచ్చినట్టుగా లేడు, ఇతరులుకి నచ్చినట్టుగానే బ్రతికాడు. అతని జీవితంలో ఆ వెలితి కొట్టొచ్చినట్టు అతనికి కనిపించింది. అది తలుచుకుని బాద పడ్డాడు.” ఏమీ చేయలేని పరిస్తితి కాలాన్ని వెనక్కి తీసుకు రాలేడు కదా..

“జీవితంలో ఎప్పుడూ మీరు కన్న కలలని వదిలి పెట్టవద్దు. మీకు నిజమైన ఆనందాన్ని, సంతుప్తిని ఇచ్చేదీ అవే..”

మరిన్ని కథలు ఇక్కడ చదవండి
తండ్రి, కొడుకుల ఎమోషనల్ స్టోరీ
నాన్న చివరి కోరిక తీర్చగలిగానా..?

Like and Share
+1
1
+1
1
+1
0

Subscribe for latest updates

Loading