ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Indian Mythological Stories in Telugu
రామానుజచార్యులవారు గొప్ప వైష్ణవ మత గురువు. విశిష్టద్వైతాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన శ్రీరంగంలో రంగనాథుడి దేవాలయం దగ్గర ఒక విడిదిలో ఉండేవారు.
అయన దినము దేవుని దర్శనం చేసుకునేవారు. ఆయన దగ్గర ఒక వంటవాడు ఉండేవాడు. అతని పేరు నమ్మాళ్వారు. నమ్మాళ్వారు ఏమి చదువుకోలేదు. కానీ వంట మాత్రం బాగా చేసేవాడు. నమ్మాళ్వారు రామానుజాచార్యుల వారికి అన్ని పనులు చేసి పెట్టేవాడు. వంట పని, బావినించి నీళ్లు తీసుకురావడం, ఆయనకు కావలసిన వస్తువులు సిద్ధం చేయడం ఈ పనులలో నమ్మాళ్వారుకు ఊపిరి సలిపేది కాదు, దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్లేవాడు కాదు.
రామానుజుల వారికి నమ్మాళ్వారును చూసి జాలి వేసేది. ఎలాగైనా నమ్మాళ్వారుకు దేవుని దర్శనం చేయించాలి అనుకున్నాడు .ఒక పర్వదినం వచ్చింది. ఆ దినం దేవుని మూర్తిని రథంలో ఉంచి ఊరేగిస్తారు. ఆ ఊరేగింపు తన విడిది మీద వెళ్లాలని రామానుజులవారు ఆజ్ఞాపించారు .
ఆయన మత గురువు కదా ఆయన చెబితే కాదనేది ఏముంది. ఆవేళ దేవుని ఊరేగింపు రామానుజాచార్యుల వారి విడిది దగ్గరగా వచ్చింది, రామానుజన్ చార్యుల వారు నమ్మాళ్వారుకు చెప్పారు “త్వరగా వెళ్లి దేవుని దర్శనం చేసుకో”
కానీ నమ్మాళ్వారు వంట ఇంట్లో పులుసుకు వంకాయ ముక్కలు తరుగుతున్నాడు . “ఒక్క నిమిషం స్వామి పులుసులో ముక్కలు వేసి వస్తాను” అన్నాడు . ఈలోగా రామానుజాచార్యులు వెళ్లి దేవుని దర్శనం చేసుకున్నారు. కానీ నమ్మాళ్వారు మాత్రం దర్శనం చేసుకోవడానికి రానేలేదు .
రామానుజాచార్యుల వారికి చాలా కోపం వచ్చింది. “మూర్ఖుడా దేవుడు ముఖ్యమా , పులుసులో ముక్కలు ముఖ్యమా” అని గద్దించారు.
నమ్మాళ్వారు నిమ్మకు నీరు ఎత్తినట్టే ఉండి అన్నాడు . “స్వామి ఆ శ్రీరంగనాథుడు మీకు దేవుడు. మీరు వారిని దర్శించుకొని పూజించుకోండి. నాకు మాత్రం మీరు దేవుడు. నా దేవుడిని నేను వంట గదిలో సేవించుకుంటాను,. అదే నాకు తృప్తి ” అన్నాడు.
రామానుజాచార్యులు దిగ్భ్రాంతులయ్యారు. ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి .
“నమ్మాళ్వార్, నువ్వు నిజమైన జ్ఞానివి” అని ఆళ్వారును కౌగిలించుకున్నారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com